వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్ విజిట్ వెళితే జోబులు ఖాళీ: భారీ ట్యాక్స్ లు

|
Google Oneindia TeluguNews

అబుదాబి: సెలవుల్లో కుటుంబ సభ్యులు,స్నేహితులతో కలిసి దుబాయ్ వెళ్లి సరదాగా గడపాలనుకునే వారికి పెద్ద షాక్. అబుదాబిలో ఇక మీదట హోటల్ లో బస చెయ్యాలన్నా, ఆహారం సేవించాలన్నా మీ జోబులు చిల్లులు పడటానికి రంగం సిద్దంఅయ్యింది. అదనపు ట్యాక్స్ వసూలు చెయ్యాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

జూన్ 1 వ తేది నుంచి ఈ నియమాలు అమలులో ఉంటాయని అబుదాబి మునిసిపల్ శాఖ, రవాణ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హోటల్ లో రాత్రి పూట బస చేస్తే అదనపు పన్ను వసూలు చెయ్యనున్నారు. హొటల్స్ లో ఇక మీదట 4 శాతం వసూలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.

Abu Dhabi hotel guests to pay new fee on bills

అర్థిక రికార్డులు అన్నింటిలో పర్యాటక ఫీజులు, మునిసిపల్ ఫీజులు ప్రత్యేకంగా చూపించాలని హోటళ్లకు సూచించారు. మునిసిపల్ ఫీజులు ఎలా వసూలు చెయ్యాలి అనే విషయంపై అవగాహన కల్పించడానికి త్వరలో వర్క్ షాప్ లు నిర్వహిస్తామని అంటున్నారు.

అబుదాబి నగరంలో పర్యాటక మౌలిక సదుపాయాలు మరింత ఎక్కువ కల్పించడానికి ఈ ఫీజులు ఉపయోగిస్తామని మునిసిపల్ శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఒక్క సారిగా నాలుగు శాతంకు పైగా ట్యాక్స్ పెంచడంతో పర్యటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అదనపు ఫీజుల ప్రభావం అబుదాబి పర్యాటక కేంద్రం మీద పడుతుందా ? లేదా ? అని వేచి చూడాలి.

English summary
The TCA c has formally notified hotels and tourist facilities of the decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X