Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ కు షాకిచ్చిన పాకిస్థాన్.. 800 మిలియన్ డాలర్లతో బిగ్ స్కెచ్..!

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ కోట్లు ఖర్చు టర్కీ, చైనా, అజర్ బైజాన్ దేశాల నుంచి సమకూర్చుకున్న డ్రోన్లు, క్షిపణులు, ఆయుధాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో 200 మంది దాక ఉగ్రవాదులు హతం అయినట్లు రక్షణశాఖ వెల్లడించింది.

అటు మిలిటరీ, రక్షణ పరంగానే కాకుండా పలు ఆర్థికపరమైన కఠిన చర్యల కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయింది. సిందూ జలాల పంపిణీ ఒప్పందం రద్దు, ఇరు దేశాల మధ్య వీసాల జారీ రద్దు, ఎగుమతులు, దిగుమతులు నిషేధం, ఇరు దేశాల పైనుంచి వైమానిక సేవలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత ఇలా పలు కఠినమైన చర్యలను భారత్ తీసుకుంది.

అయితే పాకిస్థాన్.. తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రపంచ బ్యాంకు(WB), ఐఎంఎఫ్(IMF), ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్(ADB).. తదితర అంతర్జాతీయ సంస్థల నుంచి సాయం పొందుతోంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థలు పాకిస్థాన్ కు వందల కోట్ల సాయం చేశాయి. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినా ఫలితం లేకుండా పోయింది.

అయితే తాజాగా ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్(ADB) పాకిస్థాన్ కు భారీ సాయం ప్రకటించింది. 800 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందించేందుకు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు అంగీకరిచింది. దీంతో భారత్ ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లాంటి దేశాలకు సాయం చేయడం వల్ల భవిష్యత్తులో ముప్పును కొని తెచ్చుకున్నట్లేనని అంతర్జాతీయ మీడిమా ముందు తెగేసి చెప్పింది. కానీ ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పాక్ కు భారీ సాయం ప్రకటించింది.

ADB Approves 800M Package to Boost Pakistan s Fiscal Reforms Despite India s Objections

తమ దేశానికి 800 మిలియన్ డాలర్లు సాయం అవసరం అని పాకిస్థాన్.. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్(ADB) ముందు పెట్టిన అభ్యర్థనను అంతర్జాతీయ సంస్థ అంగీకరించింది. ఆర్థిక సాయం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవైపు భారత్ వార్నింగ్ ఇచ్చినా అంతర్జాతీయ సంస్థలు పాక్ కు ఇలా సాయం చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

పాకిస్థాన్ జీడీపీలో ట్యాక్స్ కలెక్షన్స్ గత కొంత కాలంగా తగ్గిపోయాయని భారత్ స్పష్టం చేసింది. పన్నుల కలెక్షన్ 13 శాతం నుంచి 2025 నాటికి 9.2 శాతం పడిపోయినట్లు పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని భారత్ వివరించింది. అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన ఆర్థిక సాయంతో ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని స్పష్టం చేసింది.

అయితే ఇటీవల పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ 1 బిలియన్ యూఎస్ డాలర్లు అప్పు ఇచ్చింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించారు. తాము 7 బిలియన్ యూఎస్ డాలర్లు రుణం అడగ్గా.. మొదట 1 బిలియన్ యూఎస్ డాలర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+