వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్లపై ఆఫ్ఘన్ మొదటి మహిళా మేయర్ ప్రతిఘటన .. రండి.. చంపండి, పారిపోనని సంచలనం

|
Google Oneindia TeluguNews

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ల పాలనపై ప్రతిఘటన మొదలైంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో శాంతి స్థాపన కోసం కృషి చేస్తామని చెబుతున్నా , ఎవరికీ ఎలాంటి హాని జరగబోదని చెబుతున్నా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలు తీవ్ర భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మహిళలపై ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ల పాలనలో కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్న కారణంగా, ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. తాజా పరిణామాలతో 2018 లో ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదటి మహిళా మేయర్‌గా చరిత్ర సృష్టించిన జరీఫా గఫారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల పాలనను ఆమె ప్రతిఘటించారు.

ఆఫ్ఘనిస్థాన్ లో 1500 మంది భారతీయుల ఆక్రందన : కేంద్రానికి వేడుకోలు, తరలింపుపై ఉత్కంఆఫ్ఘనిస్థాన్ లో 1500 మంది భారతీయుల ఆక్రందన : కేంద్రానికి వేడుకోలు, తరలింపుపై ఉత్కం

తాలిబన్ల పాలనను ప్రతిఘటిస్తున్న ఆఫ్ఘన్ మొదటి మహిళా మేయర్ గఫారీ

తాలిబన్ల పాలనను ప్రతిఘటిస్తున్న ఆఫ్ఘన్ మొదటి మహిళా మేయర్ గఫారీ

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఊహించని విధంగా స్వాధీనం చేసుకోవడం, షరియా చట్టాన్ని తిరిగి అమలు చేయడానికి తాలిబాన్లు తలుపులు తెరిచిన కారణంగా, మహిళల హక్కుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోయిన తరువాత ఆయన ద్వారా నియమించబడిన మహిళా మేయర్ గఫారీ తనపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిగిందని, దానికి తాలిబన్లు కారణమని ఆమె వ్యాఖ్యానించారు.వారు వచ్చే వరకు తాను ఇక్కడే ఉంటానని, తన కుటుంబానికి సహాయం చేయడానికి ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. తాలిబన్లు తనలాంటి వ్యక్తుల కోసం వస్తారని తనను చంపేస్తారని ఆమె పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ విడిచి పారిపోనని స్పష్టం

ఆఫ్ఘనిస్థాన్ విడిచి పారిపోనని స్పష్టం

తన కుటుంబాన్ని విడిచిపెట్టి తాను వెళ్లలేనని, ఆఫ్ఘనిస్తాన్ ని విడిచి పెట్టి ఎక్కడికి వెళ్ళను అని గఫారీ పేర్కొన్నారు. వార్దాక్ ప్రావిన్స్ రాజధాని నగరం మైదాన్ షహర్ మేయర్‌గా ఎంపికైన ఆమె తాలిబన్లు తనను చంపేస్తారంటూ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. గఫారీ విషయానికి వస్తే ట్రంప్ పరిపాలన మార్చి 2020 లో ఆమెకు అంతర్జాతీయ ధైర్య పురస్కారంతో సత్కరించింది. ఆ సమయంలో కూడా ఆమె తాలిబన్ల పాలనపై వ్యాఖ్యలు చేశారు .ఆఫ్ఘన్ మహిళలు భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ ఆందోళన చెందుతారని హెచ్చరించారు, ఎందుకంటే వారు తాలిబాన్ల పాలనను మర్చిపోలేదని స్పష్టంగా పేర్కొన్నారు.

 తాలిబన్లు తన కోసం తప్పక వస్తారని, చంపేస్తారని పేర్కొన్న గఫారీ

తాలిబన్లు తన కోసం తప్పక వస్తారని, చంపేస్తారని పేర్కొన్న గఫారీ

మే 1, 2021 నాటికి దళాలను ఉపసంహరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత , శాంతి ప్రక్రియను నిర్ధారించడానికి "నిరంతర మద్దతు" కోసం గఫారీ యుఎస్‌ని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ లో మొట్టమొదటి మహిళా మేయర్ అయిన జరీఫా గఫారీ, తాలిబన్లు ఆమె కోసం తిరిగి వస్తారని మరియు వారు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆమెను చంపేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. గతంలో గఫారీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై మరింత ఆశాజనకంగా ఉండేవారు. ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పురోగతి మరియు మా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారని నేను భావిస్తున్నాను అని గఫారీ అన్నారు.

ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ తీసుకున్న గఫారీ.. ఇప్పటికే అనేకమార్లు హత్యాహత్నం

ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ తీసుకున్న గఫారీ.. ఇప్పటికే అనేకమార్లు హత్యాహత్నం

ఈ దేశానికి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను అని చెప్పిన గఫారీ ఇప్పుడు నిరాశా నిస్పృహల మధ్య ఆఫ్ఘన్ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం గత అనుభవాల దృష్ట్యా ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని బలంగా నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, కాబూల్‌లో ఆమె కారుపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఆమె తండ్రి, ఆఫ్ఘన్ ఆర్మీ కల్నల్, నవంబర్‌లో ఇంటి ముందు హత్య చేయబడ్డాడు. ఆ సమయంలో వారు తనను చంపలేక, తన తండ్రిని చంపారు అని ఆమె వెల్లడించారు.

Recommended Video

Imran Khan Supports Taliban, Afghanistan plunges Into Chaos | Oneindia Telugu
అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘన్ లను ఇలా వదిలేసింది : గఫారీ ఆవేదన

అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘన్ లను ఇలా వదిలేసింది : గఫారీ ఆవేదన

నేను నిలబడాలనేది మా నాన్న కల కూడా అని పేర్కొన్న గఫారీ తాలిబన్లను తీవ్రంగా ప్రతిఘటించారు. మేలో అమెరికా దేశం విడిచి వెళ్లిపోవడంపై గఫారీ మళ్లీ ఆందోళన వ్యక్తం చేశారు . అంతర్జాతీయ సమాజం పోరాడటానికి, ప్రాణాలు కోల్పోవడానికి, ఆశలు కోల్పోవడానికి, అవకాశాలను కోల్పోవడానికి ఆఫ్ఘన్ వాసులను వదిలి వేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా మంచి జీవితాన్ని కోరుకుంటారు అని తెలిపిన ఆమె తాజా పరిస్థితుల మధ్య రండి చంపండి అంటూ తాలిబన్లు తప్పకుండా వస్తారని, తనను చంపేస్తారని పేర్కొన్నారు.

English summary
Zarifa Gafari, a female mayor appointed by President Ashraf Ghani after the escape of Taliban-ruled Afghanistan, said she had been murder attempts three times by the Taliban. She claimed that the Taliban would come for people like her and kill her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X