వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీని చంపాలని పేలుడు ప్లాన్ -టార్గెట్ మిస్సైనా 9 మంది దుర్మరణం -అఫ్గాన్‌లో టెర్రర్ చర్య

|
Google Oneindia TeluguNews

వరుస ఉగ్రదాడులతో అఫ్గనిస్తాన్ అట్టుడుకుతున్నది. కీలక నేతలు, బడా లీడర్లను టార్గెట్ చేసుకున్న టెర్రరిస్టులు బహిరంగ ప్రదేశాల్లోనే భారీ దాడులకు దిగుతుంన్నారు. శనివారంనాడు రీజనల్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని అలజడి రేపిన టెర్రరిస్టులు.. తాజాగా ఎంపీ హజీఖాన్ మొహ్మద్ వార్దాక్ ను టార్గెట్ చేసుకుని పేలుడు జరిపారు..

అఫ్గాన్ రాజధాని కాబూల్ సిటీలో పీడీ5 ప్రాంతంలో ఆదివారం జరిగిన భారీ పేలుడులో 9 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 20 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ఉద‌యంపూట జ‌న‌స‌మ్మ‌ర్థం ఎక్కువగా ఉన్న వేళ‌ న‌డిరోడ్డుపై బాంబు పేలింద‌ని, దాంతో మృతులు, క్ష‌త‌గాత్రుల సంఖ్య పెరిగింద‌ని టోలో న్యూస్ సంస్థ పేర్కొన్న‌ది.

Afghanistan: 9 Killed, 6 Wounded In explosion in Kabuls PD5 Area

పేలుడు సమాచారం అందిన వెంటనే సహాక బృందాలు రంగంలోకి దిగాయని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించామని అఫ్గాన్ ఇంటీరియ‌ర్ మినిస్ట‌ర్ మ‌సూద్ అంద‌రాబి తెలిపారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ప్రకటన చేయలేదు. పేలుడు వెనకున్న కారణాలను అణ్వేషిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈలోపే..

తాజా పేలుడు టార్గెట్ ఎంపీ వార్దాకే అని మీడియాలో వర్తలు వచ్చాయి. దాడి నుంచి ఎంపీ తప్పించుకున్నా 9మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం బాల్క్ ఫ్రావిన్స్ లో రీజనల్ లీడర్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మిస్సైల్ దాడులకు పాల్పడగా, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

English summary
At least 9 people have been killed and six others were wounded in an explosion in PD5 area in Afghanistan's Kabul, on Sunday, Tolo News reported. The explosion took place in Spin Kalay square in PD5 of the city. Three vehicles have caught fire in the area (PD5), however, it is unclear if the explosion is the cause, Tolo News quoted Interior Ministry's deputy spokesman Ferdaws Faramarz as saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X