వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా తోక తొక్కేసి వెళ్లిపోయిన పెలోసీ-కోపంతో తైవాన్ పై డ్రాగన్ గంతులు-పరోక్ష యుద్ధానికి వ్యూహం ?

|
Google Oneindia TeluguNews

అమెరికా-చైనా మధ్య దశాబ్దాలుగా సాగుతున్న తోపు యుద్ధంలో ఎవరెంత అనేది ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. దీనికి చాలా చారిత్రక కారణాలున్నాయి. అయితే ఎవరెంత అనేది తేల్చుకునేందుకు ఎప్పటికప్పుడు వీరిద్దరికీ అవకాశాలు రావడం, ఒక్కోసారి ఒక్కొక్కరు తామే తోపులమని చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరోసారి అమెరికా అలాంటి పరిస్ధితినే చైనాకు కల్పించింది. దీంతో తాము తోపులమని చెప్పుకునేందుకు చైనా సిద్ధమవుతోంది.

అమెరికా-చైనా ఆధిపత్య పోరు

అమెరికా-చైనా ఆధిపత్య పోరు

అమెరికా-చైనా మధ్య వాణిజ్యంతో పాటు ఇతర అంశాల్లో అంతర్జాతీయంగా సాగుతున్న అధిపత్య పోరు ఎప్పటికప్పుడు బుసలు కొడుతూనే ఉంటుంది. దానికి ఎప్పటికీ అంతు ఉండదు. కాబట్టి ఇరుదేశాలూ సందర్భం వచ్చినపుడల్లా ఎవరికి వారు తమదే ఆధిపత్యమని చెప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో ఇన్నాళ్లూ దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లు చెప్పుకుంటున్న చైనాకు అమెరికా తన కీలక నేతను పంపి షాకిచ్చింది. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించడంతో డ్రాగన్ కు ఒళ్లు మండిపోతోంది.

పెలోసీ చర్యతో గంతులేస్తున్న చైనా

పెలోసీ చర్యతో గంతులేస్తున్న చైనా

నాన్సీ పెలోసీ తైవాన్ రాకపై చైనా అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టింది. అయినా ఆమె అవేవీ లెక్కచేయకుండా తైవాన్ రావడం, అక్కడి నేతల్ని కలవడం చకచకా జరిగిపోయాయి. అంతే కాదు అక్కడి నేతలు కూడా ఆమెను సాదరంగా ఆహ్వానించి అక్కున చేర్చుకున్నారు. దీంతో చైనాకు మంటపుట్టింది. తమను కాదని తమ చెప్పుచేతుల్లో ఉండాల్సిన తైవాన్ అమెరికా నేతను ఆహ్వానించడం, ఇదే అదనుగా పెలోసీ వచ్చివెళ్లడంతో చైనాకు భారీ షాక్ గా మారింది. దీంతో తైవాన్ కు తమ సత్తా చూపాలని భావించిన చైనా.. దక్షిణచైనా సముద్రంలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు రెచ్చిపోతోంది. ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలతో పాటు క్షిపణుల్ని ప్రయోగిస్తూ యుద్ధ సంకేతాలు ఇచ్చేస్తోంది.

ఉక్రెయిన్ వార్ రిపీట్ అవుతుందా ?

ఉక్రెయిన్ వార్ రిపీట్ అవుతుందా ?

తైవాన్ చుట్టూ చైనా చేపట్టిన మిలటరీ విన్యాసాలు చూసిన వారికి త్వరలో ఇక్కడ కూడా రష్యా-ఉక్రెయిన్ తరహా ఉద్రిక్తతలు తప్పవేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర చేసినట్లుగానే తైవాన్ పై చైనా విరుచుకుపడుతుందా అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే తైవాన్ ను ఆక్రమించుకోవడం భౌగోళికంగా అంత సులువుకాదనే భావన నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. దక్షిణ చైనా సముద్రంలోని వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న తైవాన్ ను ఆక్రమించాలంటే చుట్టూ ఉన్న అన్ని దేశాల సహకారం చైనాకు ఉండాల్సిందే. అలాగే భారత్ వంటి శత్రువులు రంగంలోకి దిగితే అది మరో మలుపు తీసుకోవచ్చు. దీంతో చైనా ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

 తైవాన్ పై చైనా వ్యూహమిదేనా ?

తైవాన్ పై చైనా వ్యూహమిదేనా ?

తనకు ఎప్పటినుంచో కొరకరాని కొయ్యగా ఉన్న తైవాన్ పై అమెరికా ఆధిపత్యం చైనాకు ఇష్టం లేదు. అలాగని తాను యద్ధానికి దిగి తైవాన్ ను ఆక్రమించడం కష్టమే. దీంతో ఇప్పుడు డ్రాగన్ ఏం చేయబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. దీనికి సమాధానంగా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు నిర్వహించడం ద్వారా తమ సత్తాను ప్రపంచానికి చాటాలన్నది చైనా మొదటి వ్యూహం. అలాగే తైవాన్ చుట్టూ సైనిక ఉద్రిక్తతల్ని పెంచడం ద్వారా సముద్ర రవాణాపై ప్రభావం చూపాలన్నది చైనా రెండో వ్యూహం. తద్వారా దక్షిణ చైనా సముద్రంపై తన పట్టును అమెరికా వంటి అగ్రరాజ్యాలకు చూపేందుకు చైనాకు అవకాశం దక్కుతుంది. తద్వారా దక్షిణ చైనా సముద్రంతో ఆధారపడిన అమెరికా మిత్రదేశాల వ్యాపారాల్ని దెబ్బకొట్టాలన్నది చైనా దీర్ఘకాలిక వ్యూహంగా చెప్తున్నారు. దీంతో తైవాన్ పై యుద్ధం కాని యుద్ధానికి చైనా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

English summary
after nancy pelosi's tour in taiwan, now china prepares for war like sitaution against that country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X