Bangladesh: బంగ్లాలో మరో అరాచకం-గంటలో సుప్రీం జడ్డీల రాజీనామా డెడ్ లైన్ ..!
బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా రాజీనామా, దేశం వదిలి వెళ్లిపోయిన తర్వాత అక్కడి పరిస్ధితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశించిన సైన్యంతో పాటు ఇతరుల ఆశ నెరవేరలేదు.
రిజర్వేషన్లలో మార్పులకు వ్యతిరేకంగా మొదలైన ఈ నిరసనలు ప్రధాని షేక్ హసీనాతో 45 నిమిషాల్లో రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయేలా చేసిన నేపథ్యంలో ఇవాళ నిరసనకారులు సుప్రీంకోర్టును టార్గెట్ చేసారు. సుప్రీంకోర్టులో జడ్జీలంతా గంటలో రాజీనామా చేయాలని డెడ్ లైన్ విధించారు.

బంగ్లాదేశ్‌లో నిరసనలకు తలొగ్గి ఇప్పటికే షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పుడు విద్యార్థులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రధాన న్యాయమూర్తితో సహా అందరు న్యాయమూర్తుల రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరసనకారులు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. దీంతో ఛీఫ్ జస్టిస్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రధాన న్యాయమూర్తి.. జడ్డీలందరినీ సమావేశపరిచారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు సుప్రీంకోర్టును ముట్టడించారు. గంటలో జడ్డీలంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఛీఫ్ జస్టిస్ ఈ సమావేశాన్ని రద్దు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే నిరసనల నేపథ్యంలో తప్పుకునేందుకు సిద్ధమని ఛీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ ప్రకటించినట్లు స్ధానిక టీవీల్లో కథనాలు వస్తున్నాయి. దీనిై ఇవాళ క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications