ఎన్నికలకు ముందు..: ప్యారిస్‌లో మళ్లీ కాల్పుల కలకలం

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యారిస్: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసుల కాల్పుల్లో దుండుగుడు హతమయ్యాడు. ఈ ఘటనకు తామే కారణమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్‌) ప్రకటించింది.

paris shooting

ఫ్రాన్స్‌లో తర్వలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగుడు హతమైనట్లు ఫ్రాన్స్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్యారిస్‌లోని ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ బోలేవార్డ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది సిటీకి మధ్యలో ఉంటుంది. కాల్పులు జరిగిన విషయం తెలియగానే సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The famous shopping street in the heart of the city, which is usually teaming with tourists and Parisians, was blocked by armed police and metro stations in the area were closed.
Please Wait while comments are loading...