పాటలతో యుద్ధం! ఉక్రెయిన్‌పై రష్యా సరికొత్త ఆయుధం..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కేవలం తుపాకులు, మిస్సైల్ శబ్దాలే కాదు.. ఇప్పుడు ఏఐ సృష్టించిన పాటలు కూడా వినిపిస్తున్నాయి. యుద్దాన్ని సమర్థించుకోవడానికి, ప్రజల మనస్సులను ప్రభావితం చేయడానికి రష్యా ఒక వినూత్న మైండ్ గేమ్‌కు తెరతీసింది. సరికొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌‌లను ఉపయోగించి యుద్ధానికి మద్దతుగా వందలాది పాటలను సృష్టించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, డిజెర్ వంటి ప్రముఖ డిజిటల్ మ్యూజిక్ యాప్‌లలో ఈ పాటలు లక్షలాది వ్యూస్ సాధిస్తూ విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.

విద్వేషాన్ని నూరిపోస్తున్న ఏఐ సాంగ్స్

ఈ ఏఐ సాంగ్ ఎంటర్మైన్మెంట్ కోసం చేసినవి కావు. శాంతియుతమైన సెంట్ సాంగ్స్ నుంచి ఉద్వేగభరితమైన త్రాష్ మెటల్ సంగీతం వరకు రకరకాల శైలుల్లో వీటిని రూపొందిస్తున్నారు. వీటిలో ఉక్రెయిన్ పౌరులను, స్థానిక జాతులను కించపరిచే పదాలను వాడటంతో పాటు రష్యా సైనికుల పోరాటాన్ని విపరీతంగా పొగుడుతున్నారు. పుతిన్ సైనిక చర్యను 'తప్పనిసరి ఆత్మరక్షణ'గా అభివర్ణిస్తూ, సరిహద్దు పోరాటాలను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ప్రాచీన సోవియట్ యూనియన్ నాటి యుద్ధ గీతాలకు ఆధునిక ఏఐ ట్యూన్‌లు జోడించి యువతను ఆకట్టుకునేలా రీమిక్స్ చేస్తున్నారు.

AI Generated Songs Erupt on Spotify and YouTube as Russia Launches New Propaganda Campaign Against Ukraine
అభయమిదే మిత్రమా: ఐక్యరాజ్యసమితిలో భారత్ కు బిగ్ బూస్ట్- తేల్చి చెప్పిన రష్యా
అభయమిదే మిత్రమా: ఐక్యరాజ్యసమితిలో భారత్ కు బిగ్ బూస్ట్- తేల్చి చెప్పిన రష్యా

900కు పైగా పాటలు.. కోట్లలో వ్యూస్

ఒక లాభాపేక్ష లేని పరిశోధన సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం, ఇప్పటివరకు దాదాపు 981 పాటలు రష్యా యుద్ధ ప్రచారానికి మద్దతుగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా సునో, ఉడియో వంటి ఏఐ మ్యూజిక్ టూల్స్ మార్కెట్‌లోకి వచ్చాకే ఈ పాటల వరద తీవ్రమైంది. వీటిలో ఒక్క ఆర్టిలరీ ఆయుధాలపై తయారు చేసిన ఏఐ పాటనే యూట్యూబ్‌లో 20 లక్షలకు పైగా వీక్షణలు సొంతం చేసుకోవడం విశేషం. ఈ తరహా కంటెంట్ వెనుక క్రెమ్లిన్ ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రష్యా ప్రభుత్వం దేశభక్తిని పెంచేందుకు వందలాది సాంస్కృతిక, కళాత్మక ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆయన దగ్గర మంచి ఐడియాలున్నాయి! మోదీ దౌత్యాన్ని ప్రశంసించిన పుతిన్
ఆయన దగ్గర మంచి ఐడియాలున్నాయి! మోదీ దౌత్యాన్ని ప్రశంసించిన పుతిన్

యాప్‌ల నిబంధనలకు దొరక్కుండా ఏఐ గారడీ

సాధారణంగా ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో విద్వేషకరమైన, సమాజాన్ని రెచ్చగొట్టే పాటలపై ఆంక్షలు ఉంటాయి. కానీ ఏఐ రూపొందించిన ఈ పాటలు ఆ నిబంధనలకు చిక్కకుండా వేరే రకమైన భాషా పదాలను, పరోక్ష అర్థాలను ఉపయోగిస్తున్నాయి. ఫిల్టర్లు కేవలం కొన్ని నిషేధిత పదాలను మాత్రమే పసిగట్టగలవని, పాట వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని పసిగట్టలేకపోతున్నాయని స్పష్టమవుతోంది. దీంతో టెక్ దిగ్గజాలు ఏఐ కంటెంట్‌ను గుర్తించే విధానాలపై కఠినమైన ఆంక్షలు విధించేందుకు కసరత్తు ప్రారంభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+