అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలన్నింటినీ సస్పెండ్ చేశారు. దీన్ని తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం అత్యవసర సర్వీసులు మాత్రమే ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
న్యూయార్క్ లోని లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ బాంబార్డియర్ సీఆర్జే-900 విమానం ప్రమాదానికి గురైంది. రన్ వే పై అదుపు తప్పి ఓ అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఎయిర్ పోర్ట్ లో భారీ వర్షం పడింది. దీనివల్ల అది రన్ వే పై నుంచి జారి ఉండొచ్చని భావిస్తోన్నారు.

జాంజ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఈ బాంబార్డియర్ మాంట్రియల్ నుండి ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సర్వీసుగా న్యూయార్క్ కు చేరుకుంది. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం విమానం మాంట్రియల్ లోని ట్రుడో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 11:37 నిమిషాలకు న్యూయార్క్ లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. రన్‌వే 4 పై దిగిన అనంతరం ట్యాక్సీ వేలో ప్రయాణించింది. సమీపంలో ఉన్న ఓ అగ్నిమాపక వాహనాన్ని ఢీ కొట్టింది.
🚨 BREAKING UPDATE: MULTIPLE CRITICAL PATIENTS AFTER AIR CANADA FLIGHT COLLIDES WITH VEHICLE WHILE LANDING AT LAGUARDIA AIRPORT. POSSIBLE FATALITIES. https://t.co/hZWimAuwe5 pic.twitter.com/62SUgxoUkA
— Breaking911 (@Breaking911) March 23, 2026
ఈ ఘటనలో విమానం నోస్ ఎడ్జ్, ముందు భాగం ఫ్యూసిలేజ్ నుజ్జునుజ్జు అయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఢీ కొట్టిన తర్వాత ఆ వేగానికి కొంతదూరం అగ్నిమాపక వాహనాన్ని ఈడ్చుకెళ్లిందీ ఫ్లైట్. విమానం వెనుక వైపునకు వాలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో అగ్నిమాపక వాహనం సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ప్రమాదం తర్వాత ఎయిర్ పోర్ట్ ను మూసివేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకటించింది. ప్రయాణికులను వెంటనే టార్మాక్‌పైకి తరలించారు. ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
WATCH: New video from LaGuardia Airport in New York City after plane collided with fire truck; multiple victims. pic.twitter.com/5cUpr3YjJf
— AZ Intel (@AZ_Intel_) March 23, 2026
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications