ప్రమాదకర పరిస్థితుల్లో కాబూల్‌కు ఎయిర్ ఇండియా-ల్యాండింగ్ సమయంలో గంట సేపు గాల్లోనే-ఎట్టకేలకు సేఫ్ రిటర్న్

ఆఫ్గనిస్తాన్‌‌లో చిక్కుకుపోయిన 129 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం కాబూల్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఆదివారం(ఆగస్టు 15) మధ్యాహ్నం 12.43గంటల సమయంలో ఢిల్లీ నుంచి కాబూల్ బయలుదేరిన విమానం... రెండు గంటల వ్యవధిలో అక్కడ ల్యాండ్ అయింది. సాయంత్రం 6గంటల సమయంలో తిరిగి కాబూల్ నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయింది. సోమవారం(ఆగస్టు 16) కూడా మరో ఎయిర్ ఇండియా సర్వీస్ కాబూల్‌కి వెళ్లే అవకాశం ఉంది. అయితే అప్పటి పరిస్థితిని బట్టి ఆ విమానాన్ని పంపించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

రేపటి ఎయిర్ ఇండియా సర్వీస్ ఉంటుందా?

రేపటి ఎయిర్ ఇండియా సర్వీస్ ఉంటుందా?

కాబూల్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో మొత్తం 162 సీట్లు ఉండగా... అన్నీ బుక్ అయ్యాయి. అయితే అందులో కేవలం 129 మంది ప్రయాణికులు మాత్రమే కాబూల్ విమానాశ్రయానికి చేరుకోగలిగారు. ఒకవేళ సోమవారం కూడా కాబూల్‌కి ఎయిర్ ఇండియా సర్వీస్‌ను ఆపరేట్ చేస్తే.. సాధ్యమైనంత ఎక్కువమందిని వెనక్కి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. అయితే ఆ సమయానికి కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నవారిని మాత్రమే తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. అసలు కాబూల్‌కి రేపటి సర్వీస్ ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడే చెప్పలేమని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

గంటసేపు గాల్లోనే విమానం...

గంటసేపు గాల్లోనే విమానం...

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేయడంతో కాబూల్ విమానాశ్రయానికి చేరుకోవడంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 'మావాడు సోమవారం ఎలాగైనా ఇండియా తిరిగి వస్తాడని... రావాలని కోరుకుంటున్నాం.' అని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తమ బంధువైన ఆ వ్యక్తి కాబూల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపాడు.ఇవాళ కాబూల్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానానికి ల్యాండింగ్ సమయంలో క్లియరెన్స్ రావడానికి దాదాపు గంట సమయం పట్టింది. దీంతో గంట పాటు ఆ విమానం గాల్లోనే ఉండిపోయింది. ఒకానొక సమయంలో పైలట్ రాడార్ సిగ్నల్స్ కూడా ఆపేశారు. విమానాన్ని టార్గెట్ చేయకుండా ఉండేందుకు ఇలా చేయాల్సి వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత గంట సేపటికి ఎట్టకేలకు కాబూల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి విమానం ల్యాండింగ్‌కి క్లియరెన్స్ వచ్చింది. సాధారణ ప్రయాణికులతో పాటు పలువురు భారత దౌత్య అధికారులు,సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు చేరుకున్నారు.

Recommended Video

    Afghanistan Vice President Trolls Pakistan | Oneindia Telugu
    తాలిబన్ల చేతికి ఆఫ్గన్...

    తాలిబన్ల చేతికి ఆఫ్గన్...

    'ఆదివారం నెలకొన్న పరిస్థితుల్లో కాబూల్‌కు విమానం నడపడం ప్రమాదకరమే అనిపించింది. కానీ ఎయిర్ ఇండియా గతంలోనూ యుద్ద ప్రాంతాల నుంచి,ప్రమాదకర ప్రదేశాల నుంచి భారతీయులను వెనక్కి తీసుకొచ్చింది.' అని సీనియర్ పైలట్ ఒకరు పేర్కొన్నారు. ఆదివారంతో తాలిబన్ల దురాక్రమణ పూర్తయింది. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో దేశం మొత్తం వారి హస్తగతమైంది. కాబూల్‌ను ఆక్రమించే క్రమంలో హింస చెలరేగుతుందని భావించినప్పటికీ... శాంతియుతంగా అధికార మార్పిడికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ వెంటనే తాలిబన్‌కు చెందిన ముల్లా బరాదర్ ఆఫ్గన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆఫ్గనిస్తాన్‌లో మరోసారి తాలిబన్ల శఖానికి తెరలేచింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+