మిలటరీ స్కూలుపై విరచుకుపడ్డ క్షిపణులు: 28 మందికి పైగా దుర్మరణం.. !

ట్రిపోలి: ఇరాక్ పై అమెరికా వైమానిక దళాలు నిర్వహించిన క్షిపణుల దాడులు మిగిల్చిన పెను ప్రకంపనలు యుద్ధ వాతావరాణికి దారి తీస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఈ సారి లిబియా రాజధాని ట్రిపోలిపైకి క్షిపణులు విరుచుకు పడ్డాయి. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై తాజాగా చోటు చేసుకున్న క్షిపణుల దాడుల్లో 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు.

పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసరంగా చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల విషయాన్ని లిబియా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ (జీఎన్ఏ) అధికార ప్రతినిధి అమీన్ అల్-హష్మి ధృవీకరించారు. 28 మంది మరణించారని వెల్లడించారు.

Air Strike On Libyas capital tripoli, 28 Dead In Military School

లిబియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వమే ఈ దాడులకు పాల్పడినట్లు చెబుతున్నారు. లిబియా సైనిక ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి నుంచి అండదండలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి జనరల్ ఖలీఫా హఫ్తర్ సారథ్యాన్ని వహిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకే ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై ఈ వైమానిక దాడులను చేపట్టారని సమాచారం. ఈ దాడులకు ఎవరు పాల్పడ్డారనే సమాచారంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

రాజధాని ట్రిపోలిలో జనావాసాల మధ్య కొనసాగుతోన్న అల్-హడ్బా అల్-ఖద్రా అనే సైనిక పాఠశాలపై ఈ దాడి నిర్వహించింది అక్కడి సైనిక ప్రభుత్వం. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి శిక్షణ ముగిసిన తరువాత అక్కడి వారందరూ గుమికూడిన సమయంలో క్షిపణులు విరుచుకుపడ్డాయి. విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడిలో 28 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+