వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఏషియా: 40మృతదేహాలు లభ్యం, బంధువుల కన్నీరు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా: 162 మందితో ఆదివారం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌లో పాల్గొంటున్న బృందాలు విమాన శకలాలతో పాటు 40 మృతదేహాలను గుర్తించాయి. ఈ విషయాన్ని ఇండోనేషియా నౌకాదళం అధికారులు ప్రకటించారు.

ఇండోనేషియా బోర్నియా ద్వీపం సమీపంలో జావా సముద్రంలో విమానం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు గుర్తించినట్లు ఏవియేషన్ సంస్థ తెలిపింది. విమాన శకలాలు ఉన్న చోట 40 మృతదేహాలు గుర్తించామని చెప్పారు. ఆ మృతదేహాలను వెలికి తీశారు. వాటిని ప్రత్యేక నౌకల ద్వారా తీరానికి చేర్చినట్లు చెప్పారు.

మృతదేహాలు లభించిన బోర్నియా సమీపంలోనే విమానం కూలిపోయి ఉండవచ్చునని చెబుతున్నారు. కూలిపోయే సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నందునే మృతదేహాలు సముద్ర పైభాగంలోకి వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తమ వారు ఎక్కడో ఓ చోట ప్రాణాలతో ఉంటారని భావించిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

జావా సముద్రంలో ఉన్న మృతదేహాలను వెలికితీస్తున్నట్లు ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండేజ్ మంగళవారం తెలిపారు. ఈ ఘటన పైన ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

162 మందితో ఆదివారం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌లో పాల్గొంటున్న బృందాలు విమాన శకలాలతో పాటు 40 మృతదేహాలను గుర్తించాయి.

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

తమ వారు ఎక్కడో ఓ చోట ప్రాణాలతో ఉంటారని భావించిన ఎయిర్ ఏషియా మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

తమ వారు ఎక్కడో ఓ చోట ప్రాణాలతో ఉంటారని భావించిన ఎయిర్ ఏషియా మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

English summary
President Joko Widowo and AirAsia CEO Tony Fernandes are on their way to Surabaya as bodies continue to be pulled out from the sea. The airlines CEO expressed regret as it became clear that the plane had crashed in the sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X