• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్-19లో అనూహ్య కోణం : బ్రెయిన్ స్ట్రోక్.. గడ్డ కడుతున్న రక్తం.. ఏ వైరస్ చేయని దాడి ఇది..

|

కరోనా వైరస్‌ను డీల్ చేసే క్రమంలో వైద్యులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు ఏ వైరస్‌ ద్వారా చవిచూడని అనూహ్య పరిణామాలను కరోనా వైరస్‌ పేషెంట్లలో వైద్యులు గమనిస్తున్నారు.

వైరస్ ప్రభావం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌లో కరోనా వైరస్ పేషెంట్లలో కొత్త లక్షణాలను గుర్తించారు.

శరీరంలోని వివిధ భాగాల్లో రక్తం గట్టిపడటం,గడ్డకట్టడం వంటి ప్రమాదకర లక్షణాలను గుర్తించారు. అంతేకాదు,పలువురు కోవిడ్-19 పేషెంట్లలో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మొదటి లక్షణంగా బయటపడుతున్నట్టు గుర్తించారు.ఇప్పటికే వైద్య శాస్త్రానికి అంతుచిక్కకుండా ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్.. ఇప్పుడిలా కొత్త రకం దాడిని కూడా మొదలుపెట్టడం మరింత భయానక పరిస్థితులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.

వైరస్.. అనూహ్య పరిణామాలు..

వైరస్.. అనూహ్య పరిణామాలు..

న్యూయార్క్‌లోని మౌంట్ సినయ్ ఆసుపత్రి వైద్యులు కరోనా పాజిటివ్ పేషెంట్ల రక్తంలో వింత మార్పులను గమనించారు. రక్తం గట్టిపడటం,గడ్డకట్టడం వంటి లక్షణాలను పలువురు పేషెంట్లలో గుర్తించారు. దీని ద్వారా శరీరంలోని అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోయి పేషెంట్ త్వరగా మృత్యు అంచులకు చేరుకునే ప్రమాదం ఉందని గ్రహించారు. మౌంట్ సినయ్‌లోని ఓ నెఫ్రాలజిస్ట్ నిపుణుడు ఇటీవల కరోనా సోకిన ఓ కిడ్నీ డయాలసిస్ పేషెంట్‌లో కాథటెర్స్‌లో రక్తం గడ్డకట్టడాన్ని గమనించారు. కోవిడ్-19 పేషెంట్లకు మెకానికల్ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న కొంతమంది పుల్మోనాలజిస్టులు.. పేషెంట్ల ఊపిరితిత్తులు రక్తం లేకుండా ఉండటాన్ని గమనించారు.

న్యూరో సర్జన్స్ ఏం చెబుతున్నారు..

న్యూరో సర్జన్స్ ఏం చెబుతున్నారు..

ఇటీవల తమవద్దకు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ కేసుల సంఖ్య కూడా పెరిగిందని న్యూరోసర్జన్స్ చెబుతున్నారు. బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టడం వల్లే స్ట్రోక్‌కి గురవుతున్నారని.. వీరిలో కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినవారిలో చిన్న వయసు వారే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. మౌంట్ సినయ్‌లో న్యూరో సర్జన్‌‌గా పనిచేస్తున్న డా.జె మొకొ దీనిపై మాట్లాడుతూ.. శరీరంలో ఇది ఎన్నిచోట్ల ఇలా క్లాట్స్(రక్తాన్ని గడ్డకట్టించడం) ఏర్పడేలా చేస్తుందో అంతుచిక్కడం లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే కరోనా వైరస్ కేవలం ఊపిరితిత్తులపై ప్రభావం చూపే వైరస్ కాదని.. ఇది అంతకంటే ప్రమాదకర వైరస్‌ అని అన్నారు. అంతేకాదు,కొంతమంది యువతీ యువకుల్లో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు కోవిడ్-19 మొదటి లక్షణంగా బయటపడుతోందన్నారు.

ట్రీట్‌మెంట్‌కు కొత్త ప్రోటోకాల్

ట్రీట్‌మెంట్‌కు కొత్త ప్రోటోకాల్

తాజా పరిణామాల నేపథ్యంలో వివిధ స్పెషాలిటీ వైద్యులు తమ దృష్టికి వచ్చిన అనుభవాలను పంచుకున్నారు. దీని నుంచి కరోనా చికిత్స కోసం ఒక కొత్త ప్రోటోకాల్‌ను అభివృద్ది చేశారు. ఇకనుంచి కరోనా వైరస్ పేషెంట్లకు రక్తం పలచబడేందుకు అధిక మోతాదులో డ్రగ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ముందు జాగ్రత్త చర్య ద్వారా పేషెంట్‌లో రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని తగ్గించవచ్చునని భావిస్తున్నారు. రక్తం గడ్డ కడితే దాని ప్రభావం పేషెంట్‌పై తీవ్రంగా ఉంటుందని.. కాబట్టి దాన్ని తగ్గించగలిగితే వైరస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చునని చెబుతున్నారు. అయితే హైరిస్క్‌లో పేషెంట్స్‌లో మాత్రం దీన్ని ఉపయోగించవద్దని నిర్ణయించారు. అలాంటివాళ్లలో ఈ డ్రగ్స్ కారణంగా బ్రెయిన్‌ సహా వివిధ అవయవాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుందని.. అందుకే వారికి ఈ ప్రోటోకాల్ వర్తించదని అంటున్నారు.

స్ట్రోక్ వచ్చే అవకాశం లేనివాళ్లలోనూ బ్రెయిన్ స్ట్రోక్..

స్ట్రోక్ వచ్చే అవకాశం లేనివాళ్లలోనూ బ్రెయిన్ స్ట్రోక్..

న్యూరో సర్జన్ డా.మొకొ మార్చి మధ్య నుంచి మూడు వారాల్లో 32 మంది బ్రెయిన్ స్ట్రోక్‌ పేషెంట్లను గుర్తించినట్టు చెప్పారు. వీరిలో సగం మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. ఇందులో ఐదుగురు వ్యక్తులు 49 ఏళ్ల లోపువారేనని.. స్ట్రోక్‌కి దారితీసేంత రిస్క్ కారణాలేవీ వారిలో కనిపించకపోవడం వింతగా అనిపిస్తోందని అన్నారు. ఇదంతా చాలా అసాధారణంగా కనిపిస్తోందని అన్నారు. మౌంట్ సినయ్‌లోనే పనిచేస్తున్న మరో ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డా.హూమన్ పూర్ తన లేట్ నైట్ షిఫ్ట్‌లలో పలు ప్రమాదకర విషయాలను గుర్తించారు. ఇటీవల 14 మంది కరోనా పేషెంట్లకు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన ఆయన.. వెంటిలేటర్ రీడింగ్స్ తాను అనుకున్నట్టు రాకపోవడం గుర్తించారు. ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణ సరిగా జరగట్లేదని గుర్తించారు. ఏదో తేడా అనిపించి వెంటనే అదే రాత్రి కిడ్నీ వైద్యుడి వద్దకు పరిగెత్తారు. ఆ పేషెంట్లలోని డయాలసిస్ కాథటెర్స్‌లో రక్తం తరుచూ గడ్డ కడుతున్నట్టు కిడ్నీ వైద్యుడు గుర్తించారు. కరోనా పేషెంట్లలో కనిపిస్తోన్న ఈ లక్షణాలకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చర్చించడానికి మౌంట్ సినయ్ ఆసుపత్రిలోని ఆయా డిపార్ట్‌మెంట్ హెడ్స్ కీలక చర్చలు జరిపారు.

  Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases
  ఏ వైరస్ చేయని దాడి ఇది..

  ఏ వైరస్ చేయని దాడి ఇది..

  చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులను గుర్తించడంతో.. మౌంట్ సినయ్ వైద్యులు అక్కడి వైద్యులతో ఫోన్ కాల్స్,వెబినార్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఫిలడెల్ఫియాలోని థామస్ జెఫర్‌సన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో డా.పాస్కల్ జబౌర్ కూడా కరోనా పేషెంట్లలో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించినట్టుగా డా.మొకొ తెలిపారు. ఇంతకుముందు ఏ వైరస్ విషయంలోనూ ఇలాంటి లక్షణాలను గుర్తించలేదని జబౌర్ తెలిపినట్టుగా పేర్కొన్నారు. కోవిడ్-19 పేషెంట్లలో బయటపడ్డ బ్రెయిన్ స్ట్రోక్ అనే ఈ కొత్త కోణం వైరస్ తీవ్రతను మరింత పెంచేదిగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు జరుపుతున్నవారికి కూడా ఇదో కొత్త పెను సవాల్ అని చెప్పవచ్చు.

  English summary
  As the novel coronavirus spread through New York City in late March, doctors at Mount Sinai Hospital noticed something strange happening to patients' blood.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X