బాలిక రేప్, హత్య: కామాంధుడికి 359 ఏళ్ల జైలు శిక్ష
కెనడా: రెండు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసి, బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. వెస్ట్ సౌత్ కెనడాలోని అలస్కా ప్రాంతానికి చెందిన జెర్రీ ఆక్టీవ్ (26) అనే యువకుడికి శుక్రవారం న్యాయస్థానం శిక్ష విధించింది.
మౌంట్ ఫోర్ట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నటుచ్ చీయా (71), ఆయన భార్య సోర్న్ స్రీప్ (73) అనే ఇద్దరు 2013 మే నెలలో హత్యకు గురైనారు. అదే సమయంలో వీరి ఇంటిలో ఉన్న మనుమరాలు (2) మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు నివేదికను కోర్టు ముందు సమర్పించారు. నిందితుడు జెర్రీ నేరం చేసినట్లు న్యాయస్థానంలో రుజువు అయ్యింది. నిందితుడు బాలిక మీద లైంగిక దాడి చెయ్యడమే కాకుండ ఇంటిలో దోపిడీ చేశాడని వెలుగు చూసింది.
పూర్తి వివరాలు సేకరించిన న్యాయస్థానం నిందితుడు నేరం చేశాడని చెప్పింది. నిందితుడికి 359 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి పిలిప్ ఓల్యాండ్ తీర్పు చెప్పారని స్థానిక మీడియా వెల్లడించింది. గతంలో జెర్రీ అనేక మంది బాలికల మీద లైంగిక దాడి చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications