వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటా ఆకారం?.. ఆ ఫోటోల్లో కనిపిస్తున్నవి ఏలియన్సా?..

నత్త లాంటి ఆకారంతో పాటు, నాలుగు కాళ్ల జీవి ఒకటి ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

ఇంటర్నెట్ డెస్క్: 'ఏలియన్స్'.. ఏళ్లుగా చర్చల నానుతున్న పేరు. నిజంగా ఏలియన్స్ ఉన్నారా? అన్న సంగతి ఇంతవరకు తేలలేదు. తెలుసుకునే ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.తాజాగా దీనికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది.

అంగారక గ్రహంపై ఏలియన్స్ ఉన్నాయన్నది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న అంశం. మార్స్ గ్రహంపై జీవరాశి ఉందా! లేదా! అని తెలుసుకోవడానికి చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా.. ఓ జీవరాశిని గుర్తించారు. అది ఏలియన్ అయి ఉండవచ్చునన్న అభిప్రాయాలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Alien hunter claims to have spotted a 'hairy spider monkey' and 'slug animal' on Mars among several bizarre sightings

కాగా, మార్స్ పై జీవి ఉనికికి అవకాశం ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి.. 2012లో ఆ గ్రహంపైకి క్యూరియాసిటీ రోవర్ ను ప్రయోగించారు. అప్పటినుంచి రోవర్ మార్స్ ఫోటోలను అందిస్తోంది. దీనికి సంబంధించి తాజాగా వెలుగుచూసిన ఫోటోల్లో అక్కడ ఓ జీవరాశి ఉన్నట్టు తెలుస్తోంది.

నత్త లాంటి ఆకారంతో పాటు, నాలుగు కాళ్ల జీవి ఒకటి ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆ నాలుగు కాళ్ల జీవి ఏలియన్స్ కి చెంది ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Many conspiracy theorists have taken the initiative to find life on Mars by analyzing every picture that is sent back to Earth from the red planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X