Covaxin: భారత్ బయోటెక్‌కు బిగ్ షాక్: 324 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ రద్దు: బ్రెజిల్ సంచలనం
బ్రసీలియా: హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ యాజమాన్యానికి బ్రెజిల్ బిగ్ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 324 మిలియన్ డాలర్లు. ఫెడరల్ కంప్ట్రోలర్ మార్గదర్శకాలు, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడమే దీనికి కారణమని భావిస్తోన్నారు. అవకతవకలు చోటు చేసుకున్నాయనే కారణంతో ఈ కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేసినట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్సెలో క్యుయిగెరా ప్రకటించారు.
Recommended Video

అయిదు లక్షలకు పైగా మరణాలు..
కరోనా వైరస్ విజృంభణ బారిన పడిన దేశాల్లో ఒకటి.. బ్రెజిల్. ప్రారంభం నుంచీ కరోనా ఇక్కడ కల్లోల పరిస్థిితులకు దారి తీస్తోనే వస్తోంది. ఇప్పటిదాకా బ్రెజిల్‌లో 1,85,13,305 మంది కరోనా బారిన పడ్డారు. అయిదు లక్షల మందికి పైగా మరణించారు. మరణించిన వారి సంఖ్య మొత్తం 5,16,119గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో బ్రెజిల్ రెండోస్థానంలో ఉంది. అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. భారత్ మూడో ప్లేస్‌లో ఉంది.

కోవాగ్జిన్ కొనుగోలు కోసం ఒప్పందం..
ఈ పరిస్థితులను నివారించడానికి బ్రెజిల్‌లో అధ్యక్షుడు బోల్సొనారో ప్రభుత్వం.. భారత్ బయోటెక్‌తో కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది. దీనికింత మొత్తం 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్‌ను బ్రెజిల్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ కాంట్రాక్ట్ విలువ 324 మిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కాంట్రాక్ట్ కుదిరింది. కాంట్రాక్ట్ కుదుర్చుకోవడంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని, భారీ డీల్ కావడం వల్ల ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత చెలరేగింది.

దర్యాప్తు సైతం షురూ
ఈ పరిస్థితుల మధ్య బ్రెజిల్ ప్రభుత్వం-భారత్ బయోటెక్ యాజమాన్యం మధ్య కుదిరిన ఒప్పందంపై దర్యాప్తు కూడా ప్రారంభమైంది. కంప్ట్రోలర్ జనరల్ విచారణ చేపట్టింది. ఫెడరల్ కంప్ట్రోలర్ జనరల్ చీఫ్ వాగ్నర్ రొసారియో సారథ్యంలో విచారణను సాగుతోందని ఆరోగ్యమంత్రి మార్సెలో తలెిపారు. కాంట్రాక్ట్ ప్రక్రియ మొత్తంపైనా విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ బయోటెక్ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందాల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వెలుగులోకి తీసుకొచ్చిన వారికి సంతృప్తికరమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

10 రోజుల్లో కంప్లీట్
ప్రాథమిక దర్యాప్తును కిందటివారమే చేపట్టినట్లు రొసారియో పేర్కొన్నారు. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మరోవంక- ఈ ఒప్పందాలపై శాఖాపరమైన దర్యాప్తును కూడా చేపట్టినట్లు మంత్రి మార్సెలో తెలిపారు. ఒప్పందంలో భాగంగా ఇప్పటిదాకా ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా బ్రెజిల్‌కు పంపలేదనే వార్తలు వచ్చినప్పటికీ.. నేషనల్ హెల్త్ సర్వైలెన్స్ ఏజెన్సీ దాన్ని తోసిపుచ్చింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications