వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేడుకల కోసం వెళ్తుండగా విషాదం : ఇరాక్‌లో పడవ బోల్తా, 100 మంది మృతి ?

|
Google Oneindia TeluguNews

బాగ్దాద్ : ఇరాక్‌లో పడవ బోల్తా విషాదం నింపింది. నిన్న మోసుల్‌లోని టిగ్రి నదిలో ఈ ఘటన జరిగింది. పడవ ప్రమాదంలో 100 మంది మృతిచెందారు. వీరిలో 19 మంది చిన్నారులు ఉన్నారు. మరో 55 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. పడవ ప్రయాణించే సమయంలో అందులో 200 మందికి పైగా పర్యాటకులు ఉన్నారు. పడవ ప్రమాదంలో 83 మంది చనిపోయారని నిర్ధారించామని అధికారులు చెప్తుండగా, సీఎన్ఎన్ వార్తా పత్రిక 92 మంది చనిపోయినట్టు తన కథనంలో పేర్కొంది.

ఈతరాదు, ఊపిరి ఆగింది
మృతుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారని మోసుల్ పౌరరక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పడవ నదీలో పడిపోయాక, గట్టు మీదికి వచ్చేందుకు వారికి ఈత రాకపోవడమే కారణమని తెలిపాయి. ఆ పడవ సామర్థ్యం 50 మంది మాత్రమే తీసుకెళ్లగలదు. కానీ 250 మందిని కుక్కి పంపించడంతో ప్రమాదం జరిగినట్టు వెల్లడించాయి. దీంతోపాటు సాంకేతిక కారణాల వల్ల పడవ మునిగిపోయిందని ... పడవ ప్రమాదం తరువాత ఆ ప్రాంతంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్టు వివరించాయి.

Almost 100 dead as overloaded ferry capsizes in Tigris river in Mosul

వేడుకల కోసం వెళ్తుండగా విషాదం
ఇరాక్‌లో ముస్లింలు పర్షి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ద్వీపానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందిని అధికారులు పేర్కొన్నారు. పడవ మునిగిపోయిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పర్యాటకులను తీసుకెళ్తున్న వారిని గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇరాక్ ప్రధానమంత్రి అదెల్ అబ్దుల్ మహ్ది అధికారులను ఆదేశించారు.

English summary
A ferry carrying over 200 people capsized in the Tigris river in Iraq’s city of Mosul on Thursday. Iraq’s interior ministry said 94 people had died in the incident and 55 people were rescued, Spokesperson Saad Maan said at least 19 children were among the dead.Husam Khalil, head of Mosul’s Civil Defence Authority, said most casualties were women and children who could not swim, reported Reuters. Khalil said the ferry had been overloaded. “It can normally carry 50 people,” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X