సౌదీ ఎడారిలో అరుదైన ఒంటె చిత్రాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

రియాద్: దాదాపు 2 వేల ఏళ్ల క్రితం రాతిపై చిత్రించిన అరుదైన ఒంటె చిత్రాలను సౌదీ అరేబియా ఎడారిలో ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. రెండు వేల ఏళ్ళ క్రితం నాటి భారీ ఒంటె చిత్రాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

వాస్తవానికి సౌదీ అరేబియాలో ఇలాంటి చిత్రాలు లభ్యకావడం కొత్తేమీ కాదని చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఒకే ప్రాంతంలో దాదాపు 12 ఒంటెల చిత్రాలు ఉ‍న్నాయని, ఇలా ఒకే చోట ఇన్ని చిత్రాలు ఉండటం అరుదని చెప్పారు.

Amazing Life-Sized Sculptures of Camels and Horses Discovered in Saudi Arabia

కొన్ని చిత్రాలను పూర్తిగా చెక్కకుండా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.. బహుశా ఈ ప్రదేశం నుంచి ప్రార్థనలు చేయడం వల్ల ఈ చిత్రాలను చెక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

అరేబియన్‌ రాక్‌ ఆర్ట్‌లో పెయింటింగ్‌, శిలలపై చెక్కడానికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ముఖ్యంగా యుద్ధం, వేట, జంతువులకు సంబంధించిన బొమ్మలను రాక్‌ ఆర్ట్‌లో భాగంగా పూర్వకాలపు అరేబియన్లు చిత్రించేవారని వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Archaeologists in Saudi Arabia have discovered a series of rock reliefs dating back some 2,000 years. The life-sized sculptures show realistic impressions of several animals, though they have been badly damaged by years of erosion and rough treatment by humans.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X