వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అణు పరీక్షలు, క్షిపణుల ప్రయోగంతో ప్రత్యర్థి దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కు అమెరికా చుక్కలు చూపించింది. ఇక మాటల్లేవ్ అంటూ ప్రకటించిన వెంటనే అమెరికా చేతల్లోకి దిగింది.సూపర్ బాంబును అమెరికా పరీక్షించింది.

కిమ్‌కు ట్రంప్ షాక్: ఖండాంతర క్షిపణి ప్రయోగించిన అమెరికా,ఇక మాటల్లేవ్కిమ్‌కు ట్రంప్ షాక్: ఖండాంతర క్షిపణి ప్రయోగించిన అమెరికా,ఇక మాటల్లేవ్

తన చర్యలతో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది ఉత్తరకొరియా. అమెరికా పలు మార్లు హెచ్చరికలు జారీ చేసినా కానీ, ఆ హెచ్చరికలను మాత్రం ఉత్తరకొరియా పట్టించుకోలేదు.

అమెరికాకు షాక్: మరోసారి అణుపరీక్షలకు ఉత్తరకొరియా రె'ఢీ'అమెరికాకు షాక్: మరోసారి అణుపరీక్షలకు ఉత్తరకొరియా రె'ఢీ'

రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణిని కూడ ఉత్తరకొరియా పరీక్షించింది. జపాన్‌కు సమీపంలో ఈ క్షిపణి లభ్యమైంది. అయితే ఈ క్షిపణి ప్రయోగంతో జపాన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జపాన్ ఆదేశాలను జారీ చేసింది.

ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు సిద్దం: ట్రంప్ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు సిద్దం: ట్రంప్

అయితే దక్షిణ కోరియా ఉత్తర కొరియా చర్యలకు అడ్డుపడేందుకు సిద్దమైంది. ఉత్తరకొరియా సరిహద్దుల్లో బాంబు దాడులకు పాల్పడింది దక్షిణ కొరియా.ఉత్తరకొరియా వ్యవహరశైలిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఉత్తరకొరియాకు తగిన బుద్ది చెప్పాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

సూపర్ బాంబును పరీక్షించిన అమెరికా

సూపర్ బాంబును పరీక్షించిన అమెరికా

ఉత్తర కొరియాకు చెక్ చెప్పేందుకు అమెరికా ప్రయత్నాలను ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితి సహ పలు దేశాలు హెచ్చరిస్తోన్న ఉత్తరకొరియా మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు అమెరికా రంగంలోకి దిగింది. న్యూక్లియర్ సూపర్ ‌బాంబును పరీక్షించింది అమెరికా. ఇక మాటలతో పని కాదు ... చేతల్లోకి దిగాలని ట్వీట్ చేసిన ట్రంప్ వెంటనే ఈ బాంబును పరీక్షించారు.

బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన అమెరికా

బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన అమెరికా

ఉత్తరకొరియాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు అమెరికా కూడ సంకేతాలను పంపింది. అమెరికా నేవీ హవాయిలో బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. బీ 61-12 బాంబును కిమ్ దేశాన్ని అడ్డుకొనేందుకు ఉపయోగపడుతోందని ఫసిఫిక్ మిస్సెల్ రేంజ్ ఫెసిలిటీ ప్రకటించింది.

 ఉత్తరకొరియాపై బాంబుదాడులు

ఉత్తరకొరియాపై బాంబుదాడులు

జపాన్ మీదుగా పసిఫిక్ సముద్రంలోకి క్షిపణిని ప్రయోగించడంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై అమెరికా, మిత్రదేశాలైన జపాన్, దక్షిణకొరియా తీవ్రఆగ్రహంగా ఉన్నాయి. దీంతో కిమ్ జాంగ్ ఉన్‌ను భయపెట్టాలని భావించిన అమెరికా గురువారం ఓ దుందుడుకు చర్యకు పాల్పడింది. దక్షిణకొరియాలో సైనిక విన్యాసాలను జరుపుతున్న తమ యుద్ధవిమానాల సహాయంతో ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలో బాంబులను విసిరింది.

తీవ్రంగా స్పందించిన కిమ్

తీవ్రంగా స్పందించిన కిమ్

తమ సరిహద్దుకు సమీపంలో దక్షిణకొరియాలో బాంబులను విసరడం పట్ల ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురువారం స్పందించారు. ‘అనాగరిక చర్య'గా కిమ్ అభివర్ణించారు. ఉత్తరకొరియా ఒక్క క్షిపణిని ప్రయోగిస్తే చాలు వెంటనే వెనక్కి వెళ్లిపోతారని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా దక్షిణకొరియాలోని ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలో యూఎస్ బాంబర్లు, యుద్ధ విమానాలను అమెరికా మోహరించించడం పట్ల కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
The United States has announced it has tested a nuclear super bomb in a show of strength in the face of North Korean warmongering.America’s increasingly hard line towards Kim Jong-un was underlined by President Donald Trump who tweeted that “ talking is not the answer ” to dealing with the rogue leader’s regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X