అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్: జో బైడెన్‌కు పరీక్షలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కరోనావైరస్ బారినపడ్డారు. అస్వస్థతకు గురైన ఆమెను వైద్యులు పరీక్షించగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు అమెరికా అధికారిక భవనం వైట్‌హౌస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

జీ20 సమ్మిట్‌ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటనకు కొద్ది రోజుల ముందే ఆయన సతీమణికి కరోనా రావడం గమనార్హం. అయితే, జో బైడెన్‍కు మాత్రం కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. ఈ వారం బిడెన్‌ను క్రమం తప్పకుండా పరీక్షించి, లక్షణాల కోసం పర్యవేక్షిస్తానని పియరీ తెలిపారు.

America First Lady Jill Biden Tests Positive For Covid-19

జో బైడెన్‌కు కరోనా నెగెటివ్ రావడంతో ఆయన భారత్‌లో జరిగే జీ20 సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ.. గత కొద్ది నెలలుగా కోవిడ్ కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఐరోపాలోని కొన్ని దేశాలతోపాటు అమెరికాలోనూ కరోనా కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తోంది.

కరోనా కొత్త వేరియంట్‌ పేరు BA.2.86, పిరోలా. ఇది ఒమైక్రాన్‌ వేరియంట్‌కి సబ్ వేరియంట్‌. ఒమిక్రాన్ వేరియంట్‌తో పోలిస్తే పిరోలాలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని, అందువల్లే అది వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
కాగా, పిరోలా 2023 మార్చిల్లో ఇజ్రాయెల్‌లో మొదటి సారి కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికా, బ్రిటన్, చైనా ఇజ్రాయెల్, కెనడా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది.

యూకేలో కొత్తగా తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. ఇది టీకాలు తీసుకున్న వ్యక్తులకు కూడా సోకుతుంది. అయితే తాజా వేరియంట్‌కి సంబంధించిన సమాచారం పరిమితంగానే అందుబాటులో ఉన్నందునా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+