America vs China: కొనసాగుతున్న ట్రేడ్ వార్.. చైనా, హాంకాంగ్ పార్శిళ్లు బంద్
America vs China: ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన చైనా, అమెరికా దేశాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా.. తాజాగా చైనా, హాంకాంగ్ ల నుంచి వచ్చే పార్శిళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్(యూఎస్పీఎస్) ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త వాణిజ్య చర్చలను అనుసరించి చైనా, హాంకాంగ్ ల నుంచి వచ్చే అంతర్జాతీయ పార్శిళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫిబ్రవరి 4 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
డి వినిమిస్ కింద అమెరికాకు రవాణా అవుతున్న పార్శిళ్లలో దాదాపు సగం చైనా నుంచే వస్తున్నాయని యూఎస్ కాంగ్రెస్ కమిటీ గతంలోనే తెలిపింది. ఇది ఈ-కామర్స్ దిగ్గజాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పెరిగిన పార్శిల్ తనిఖీల కారణంగా డెలివరీలు ఆలస్యం కావచ్చు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుంది. షీన్, టెము వంటి ఇ-కామర్స్ కంపెనీలు కొత్త నిబంధనల కారణంగా సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ మార్పులు సరిహద్దు షాపింగ్‌కు ఆటంకం కలిగించవచ్చు, ముఖ్యంగా ఇతర దేశాల నుండి తక్కువ-ధర ఉత్పత్తులపై ఆధారపడే అమెరికన్ దుకాణదారులకు ఇబ్బంది కలగవచ్చు.

ట్రంప్ తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనాపైనా సుంకాల కొరడా ఝులిపించిన సంగతి తెలిసిందే. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంక విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయగా.. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ తో దాడి చేసింది. డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధం ప్రారంభించిన కొన్ని రోజుల అనంతరం ప్రతి చర్యగా అనేక రకాల అమెరికన్ వస్తువులపై చైనా ప్రతిగా 10 నుంచి 15 శాతం సుంకాలను విధించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తులపై 15 శాతం , క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు , పెద్ద కార్లు, పికప్ ట్రక్స్, ఇతర ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వచ్చాయి. కానీ నిరసనల తర్వాత మెక్సికో, కెనడాపై విధించిన సుంకాల వ్యవధిని ఒక నెల పాటు పొడిగించారు. కానీ చైనాపై సుంకాన్ని అలాగే ఉంచారు. ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధించాలనే నిర్ణయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సుంకాన్ని వ్యతిరేకిస్తున్నామని చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికా తప్పుడు పద్ధతిని ఉపయోగిస్తోందని.. మా ప్రయోజనాలు కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటన విడుదల చేసింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications