వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7.1 తీవ్రతతో పెనుభూకంపం: సునామీ భయం: తీర ప్రాంతాల్లో అలజడి

|
Google Oneindia TeluguNews

మనీలా: ద్వీపదేశం ఫిలిప్పీన్స్‌లో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. సముద్రంలో భూకంపం సంభవించడం వల్ల సునామీ వస్తుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. సునామీ సంభవించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. భయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు రాలేదు.

7.1 తీవ్రతతో

7.1 తీవ్రతతో

ఫిలిప్పీన్స్‌స్‌ ఈశాన్య ప్రాంతంలోని డోలోర్స్‌‌లో ఆ దేశ కాలమానం ప్రకారం.. ఉదయం 8:43 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. రాజధాని మనీలాకు ఈశాన్య దిశగా సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లోని డోలోర్స్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. సముద్ర తీర ప్రాంత పట్టణం ఇది.

30 సెకెన్ల పాటు..

30 సెకెన్ల పాటు..

ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున భూఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు జియాలాజికల్ సర్వే తెలిపింది. 30 సెకెన్ల పాటు భూమి ప్రకంపించినట్లు నార్త్త లొకొస్ సుర్ ప్రావిన్స్ ఎంపీ ఎరిక్ సింగ్సన్ తెలిపారు. దీని తీవ్రతకు తన భవన కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. తీర ప్రాంత పట్టణం కావడం వల్ల.. భూకంప దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని- భూకంపం సంభవించిన కొద్ది క్షణాల్లోనే సైప్రస్ ప్రభుత్వం సునామీ అలర్ట్‌ను జారీ చేసింది. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకుంది.

మనీలాపై సైతం..

భూకంప తీవ్రత సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని మనీలాలో సైతం కనిపించిందంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మనీలాలో పలు అపార్ట్‌మెంట్ల కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. అటు డొలొర్స్ వద్ద తీర ప్రాంతంలో అలజడి ఏర్పడింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడే ప్రమాదం ఉందని హెచ్చరికలను జారీ చేశారు.

రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలివే..


తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీలైనంత వరకు తీర ప్రాంతాలకు వెళ్లడాన్ని మానుకోవాలని స్థానిక ప్రజలకు సూచించారు. ఫిలిప్పీన్స్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటి. ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి గానీ.. ఈ స్థాయిలో భూమి ప్రకంపించడం సుదీర్ఘకాలం తరువాత ఇదే తొలిసారి. బొలీవియా, చిలి, ఈక్వెడార్, పెరు, కోస్టారికా, గ్వాటెమాలా, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా.. రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి.

English summary
An earthquake with a magnitude of 7.1 on the Richter Scale hit 14 km SE of Dolores, Philippines. It was shaking towers more than 300 kilometres away in Manila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X