జెరూసలేం రాజధానిగా ప్రత్యేక పాలస్తీనా..!!
జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.
గత శనివారం ఆరంభమైందీ యుద్ధం. ఈ వారం రోజుల వ్యవధిలో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 3,200 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంటోంది. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతుందనే అంచనాల ఉన్నాయి. నాలుగు లక్షలమంది నిరాశ్రయులయ్యారు.

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
దీనితో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
యుద్ధం భీకరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- పాలస్తీనా సంక్షోభాన్ని నివారించడానికి కొన్ని సూచనలు చేశారు. శుక్రవారం మాస్కోలో ఏర్పాటయిన కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ సమ్మిట్‌లో ప్రసంగించారు పుతిన్.

ప్రత్యేక పాలస్తీనా దేశాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఈ సుదీర్ఘ సంక్షోభానికి తెర పడుతుందని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఈ దేశానికి ఈస్ట్ జెరూసలేం నగరాన్ని రాజధానిగా ప్రకటించాలని సూచించారు. ఈ సంక్షోభాన్ని నివారించడంలోొ- దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారాయన.
పాలస్తీనీయన్ హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తనను తాను కాపాడుకోవడానికి ప్రతిదాడులు చేసే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందరి అన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని పుతిన్ అన్నారు.
ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య చర్చలకు ఐరాస సారథ్యాన్ని వహించాలని పేర్కొన్నారు. ప్రత్యేక దేశం అనే ప్రతిపాదనలపై సానుకూల వాతావరణంలో చర్చలను చేపట్టాలని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కలిసి పాలస్తీనియన్లు శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ ప్రతిపాదనలు ఉపకరిస్తాయని పుతిన్ వ్యాఖ్యానించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications