బూట్ల గొడవ: భారతీయుడిపై హత్యాయత్నం

మిలాన్: చిన్న విషయంలో గొడవ జరిగడంతో సహనం కొల్పోయిన యువకుడు ఓ భారతీయుడిని కత్తితో దారుణంగా పోడిచిన సంఘటన పిలిప్పీన్స్ లో జరిగింది. తీవ్రగాయాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అక్కడి పోలీసులు చెప్పారు.

బాధితుడిని ఏఎస్ (47) గా గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు రెన్ జో మికాలట్ (19) ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. వీరిద్దరూ ఒకే ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. మురికి బూట్ల విషయంలో వీరిద్దరి మద్య గొడవ జరిగింది.

 An Indian man was stabbed by his Filipino flatmate over his stinking shoes

భారతీయుడికి చెందిన బూట్లు తీసుకుని ఫ్లాట్ నుంచి బయటపడేసేందుకు మికాలట్ ప్రయత్నించాడు. ఆ సందర్బంలో భారతీయుడు అడ్డుకుని బుద్ధి మాటలు చెప్పాడు. అంతే సహనం కొల్పోయిన మికాలట్ వంట గదిలో ఉన్న కత్తి తీసుకు వచ్చి భారతీయుడిని ఇష్టం వచ్చినట్లు పోడిచేశాడు.

అతను రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భారతీయుడిని ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి భయం లేకుండా కత్తి శుభ్రం చేస్తున్న మికాలట్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటలీకి చెందిన మికాలట్ కు ఉద్యోగం లేదని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+