సింగపూర్‌కు తొలిసారిగా మహిళా అధ్యక్షురాలుగా హలీమా ఎంపిక, విమర్శలు

Posted By:
Subscribe to Oneindia Telugu

సింగపూర్: సింగపూర్‌కు ఓ మహిళ అధ్యక్షురాలిగా హలిమా ఎంపికయ్యారు. ఒక్క ఓటు లేకుండానే పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేసిన హలీమా యాకోబ్‌ను సింగపూర్ అధ్యక్షురాలిగా ప్రకటించారు.

సింగపూర్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఈ రికార్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత కీలకమైన అధ్యక్షపదవికి ఎన్నికలు నిర్వహించకుండానే ఎలా కట్టబెడుతారంటూ చర్చ సాగుతోంది.

Anger as Singapore gets first female president without a vote

ఎలాంటి అర్హత నియమాలను పాటించకుండానే హలిమాను అధ్యక్షురాలిగా నియమించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే పార్టీ కొన్ని ఏళ్ళుగా సింగపూర్‌ను పరిపాలిస్తోంది. అయితే దఫాల వారీగా వివిధ కమ్యూనిటీలకు అధ్యక్ష బాధ్యత అప్పగించే పనులు చేస్తోంది.

అయితే ఈ దఫా మాలె వర్గానికి ఆ బాధ్యతలను అప్పగించాలనుకొన్నారు. అయితే ఎన్నికలు నిర్వహించకుండానే ఏపక్షంగా హలీమాకు ఈ పదవిని కట్టబెట్టడం అదే వర్గంలోని ఇతరులకు మింగుడుపడడం లేదు.

ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎన్నికలు లేకుండా ఎన్నికయ్యారు. ఇదొక హస్యాస్పదమంటూ విమర్శలు వెల్లువెత్తాయి.పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన హలీమా దాదాపు 20 ఏళ్ళుగా అదే పార్టీలో ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Singapore got its first female president Wednesday, but the milestone was overshadowed by criticism that her selection was undemocratic after she was handed the job without a vote.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి