షాకింగ్: బర్డ్స్ షోలో బాలుడ్ని తన్నుకుపోయిన గద్ద

Posted By:
Subscribe to Oneindia Telugu

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ బర్డ్స్ షోలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఏడేళ్ల బాలుడిని ఓ పెద్ద గద్ద తన్నుకుపోయింది. సెంట్రల్ ఆస్ట్రేలియాలోని అలైస్ స్ప్రింగ్ డిసెర్ట్ పార్కులోకి ఏడేళ్ల బాలుడు తన కుటుంబంతో పాటు వచ్చాడు.

ఈ పార్కులో అతిపెద్ద గద్దలు ప్రత్యేక ఆకర్షణ. ఆ బాలుడి, అతని కుటుంబం ఓ వైపు పక్షులను తిలకిస్తోంది. బాలుడు ఓ వైపు పక్షులను చూస్తూ, మరోవైపు తన షర్టుకు ఉన్న క్యాప్‌ను పైకీ కిందకూ ఆడిస్తూ ఉన్నాడు.

 Angry bird: Eagle attacks young boy during a bird show in Australia

ఇది గమనించిన ఓ గద్ద ఏకంగా అతని పైకి వచ్చి, అతనిని పట్టుకోని గాలిలోకి ఎగిరింది. బాలుడి హాహాకారాలు, అతని తల్లి ఆర్తనాదాల మధ్య దాదాపు పదిహేను మీటర్ల దూరం ప్రయాణించింది. చివరికి అతనిని అక్కడ వదిలి పెట్టి వెళ్లిపోయింది.

వస్తున్న వార్తల ప్రకారం.. ఆ బాలుడి పేరు ఆల్బురీ వొడాంగా. ముఖంపై గోరు గాట్లు మినహా మరేమీ కాలేదని తెలుస్తోంది. బాలుడిని తన్నుకుపోయిన గద్ద కు 2.5 మీటర్ల వెడల్పయిన రెక్కలు ఉంటాయని, ఇది ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఈగిల్ జాతి రకమని చెబుతున్నారు. అతను ఎంతో లక్కీ అని, మరికొన్ని అడుగులు పైకి ఎగిరుంటే పెను ప్రమాదం జరిగేదంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This poor little lad turned a victim of a gruesome Eagle attack at a bird show in Australia.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X