Myanmar Earthquake: మయన్మార్ లో మళ్ళీ భూప్రకంపనలు-భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్..!

మయన్మార్ ను భూకంపాలు వదలడం లేదు. నిన్న ఏకంగా 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపానికి భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా వాటిల్లాయి. ఇంకా భవనాల కింద వందల సంఖ్యలో జనం చిక్కుకుని ఉన్నారు. దీని నుంచి కోలుకోకముందే ఇవాళ మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. 4.7 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలకు జనం మళ్లీ పరుగులు తీశారు. నిన్నటి విషాదం నుంచి బయటపడకముందే మళ్లీ ప్రకంపనలు రావడంతో మయన్మార్ వాసులు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని బతుకుతున్నారు.

మయన్మార్ లో నిన్నటి భూకంపానికి చనిపోయిన వారి సంఖ్య వెయ్యి దాటిపోయింది. రెండున్నర వేలకు మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇంకా 30 మంది కనిపించకుండా పోయారు. వీరిని రక్షించేందుకు భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరి వెళ్లాయి. అలాగే మయన్మార్ కు మానవతా సాయం కింద ఆపరేషన్ బ్రహ్మ పేరుతో కేంద్రం సాయం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో 40 టన్నుల ఆహారపదార్ధాలు, ఇతర సాయాన్ని పంపినట్లు విదేశాంగమంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు.

Another aftershock hits Myanmar with 4 7 magnitude india s operation brahma for relief

భారత్ తో పాటు పలు దేశాలు భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్ కు సాయం పంపుతున్నాయి. అలాగే క్షేత్రస్ధాయిలో సహాయక చర్యలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇవాళ వచ్చిన ప్రకంపనలు వీటిపై ప్రభావం చూపాయి. ప్రకంపనల భయంతో సహాయక సిబ్బంది చర్యల్ని తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద భూకంపం తర్వాత ఇలాంటి ప్రకంపనలు సహజమేనని నిపుణులు చెప్తున్నారు. అయినా నిన్నటి భూకంపం భయానికి జనంలో వణుకు మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+