ఉక్రెయిన్‌లో మరో విద్యార్థి మృతి: పంజాబ్‌కు చెందిన స్టూడెంట్.. ఎలా చనిపోయారంటే

రష్యా ఉక్రెయిన్ యుద్దంలో మునిగిపోయాయి. ఇతర దేశాలకు చెందిన వారి తరలింపు కొనసాగుతోంది. ఇండియాకు చెందిన విద్యార్థులను కూడా తరలిస్తున్నారు. అయితే ఖర్కివ్‌పై రష్యా బలగాలు చేసిన దాడిలో భారత్‌కు చెందిన మెడిసిన్ చదివే నవీన్ శేఖరప్ప చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ భారత విస్తుపోయింది. అంతా సంతాప తెలియజేశారు. మిగతా విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మరో పిడుగులాంటి వార్త.. అవును మరొ భారతీయుడు కూడా చనిపోయాడు. పంజాబ్‌కు చెందిన విద్యార్థి ఒకరు చనిపోయారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కన్నుమూశాడు. అతను అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. ఆస్పత్రిలో ఉండి.. కన్నుమూశాడు.

another indian student died in ukraine. he belongs to punjab. died due to heart stroke.

ఇటు కర్ణాటకలోని హవేరి జిల్లాకు చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్ప.. ఖర్కివ్‌లో స్టోర్‌‌కు వెళ్లిన సమయంలో బాంబుల దాడి జరిగింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌.. మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబసభ్యులతో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఫోన్‌‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమయంలో ప్రతీ క్షణమూ చాలా విలువైనదని, భారత ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో మన విద్యార్థులను సురక్షితంగా వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని రాహుల్ సూచించారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆదేశాల‌తో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నిన్ననే రంగంలోకి దిగిపోయింది. విదేశాంగ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు సీ-17 విమానాల‌ను ఉక్రెయిన్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించేందుకు స‌హ‌క‌రించాల‌ని అటు ఉక్రెయిన్‌తో పాటు ఇటు ర‌ష్యాను కోరాల‌ని విదేశాంగ శాఖ‌కు మోడీ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఇప్ప‌టికే ఆ రెండు దేశాలతో విదేశాంగ శాఖ చ‌ర్చ‌లు ప్రారంభించింది. ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం సీ-17 విమానాలు ఏ క్ష‌ణంలో అయినా టేకాఫ్ తీసుకునేందుకు రంగం సిద్ధ‌మయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+