జపాన్ లో మరో కొత్త వైరస్.. ఈక్ మ్యూటేషన్ : ఒలంపిక్స్ ముందు జపనీస్ కు ఫోర్త్ వేవ్ భయం

జపాన్ దేశాన్ని ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది . ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఇప్పటికే అనేక దేశాలలో ఉత్పరివర్తన చెందుతూ కొత్త వేరియంట్ లను సృష్టిస్తోంది. ప్రస్తుతం అనేక దేశాలలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా జపాన్ లో వైరస్ ఉత్పరివర్తన ఏకంగా కరోనా ఫోర్త్ వేవ్ భయాలకు కారణమవుతోంది.మరో మూడు నెలల్లో జపాన్లో ఒలంపిక్స్ మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పుడు కరోనా కొత్త వైరస్ కలకలం రేపుతోంది.

జపాన్ లో బయటపడుతున్న కొత్త మ్యూటేషన్ వైరస్ లు , అత్యవసర చర్యలు తీసుకుంటామన్న ప్రధాని

జపాన్ లో బయటపడుతున్న కొత్త మ్యూటేషన్ వైరస్ లు , అత్యవసర చర్యలు తీసుకుంటామన్న ప్రధాని

ప్రస్తుతం జపాన్లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి . అంతేకాకుండా మ్యుటేషన్లు సైతం బయట పడుతున్నాయి . వైరస్ ఉత్పరివర్తనలు వ్యాప్తి చెందుతాయనే భయాల మధ్య, కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి అవసరమైన అత్యవసర చర్యలను విస్తరిస్తామని జపాన్ ప్రధాన మంత్రి యోషిహిడే సుగా పేర్కొన్నారు.

ఒసాకా యొక్క పశ్చిమ మహానగరం సహా ప్రభావిత ప్రాంతాల జాబితాలో టోక్యోను కూడా చేర్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని జపాన్ ప్రధానమంత్రి అన్నారు.

జపాన్ లో భయపెడుతున్న ఈక్ మ్యూటేషన్ .. 70 % కేసులు ఈక్ మ్యూటేషన్ వే

జపాన్ లో భయపెడుతున్న ఈక్ మ్యూటేషన్ .. 70 % కేసులు ఈక్ మ్యూటేషన్ వే

తాజాగా జపాన్లో ఈక్ మ్యూటేషన్ బయటపడింది. టోక్యో నగరం తో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఈక్ మ్యుటేషన్ జోరుగా విస్తరిస్తోంది. టోక్యోలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు ఈక్ వేరియంట్ గా నిర్ధారణ అయింది. జులై నెలలో ప్రారంభం కానున్న వేసవి ఒలింపిక్స్‌కు ముందు జపాన్ కరోనా మహమ్మారి తో ప్రస్తుతం యుద్ధం చేస్తుంది

. ఆదివారం, టోక్యోలో 355 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది జనవరిలో 2,500 కి పైగా ఉంది.
ఒసాకా చుట్టూ ఇటీవల పాజిటివ్ పరీక్షించిన వారిలో మ్యూటేషన్ వైరస్ కేసులు పెరగడం గురించి ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఈక్ వేరియంట్ పై భయాలు , టీకా రక్షణ తగ్గిస్తుందని భయం

ఈక్ వేరియంట్ పై భయాలు , టీకా రక్షణ తగ్గిస్తుందని భయం

ఈ వేరియంట్, వేగవంతంగా విస్తరిస్తుందని భయపడుతున్నారు. ఒసాకా ప్రిఫెక్చర్లో ఆదివారం మొత్తం 594 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, రికార్డు స్థాయిలో 666 కేసులు నిర్ధారించబడిన ఒక రోజు తర్వాత ఈ కేసులు నమోదయ్యాయి.

టోక్యోలో పెరుగుతున్న కేసులలో E484 మ్యుటేషన్తో సహా గత సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా వైరస్ యొక్క వైవిధ్యాలు పెరిగాయని అధికారులు చెప్పారు. గత నెలలో టోక్యో ఆసుపత్రిలో పరీక్షించిన కరోనావైరస్ రోగులలో 70% మంది E484K మ్యుటేషన్‌ను గుర్తించారు .దీనినే శాస్త్రవేత్తలు "ఈక్" అని పిలుస్తారు .అయితే ఇది వ్యాక్సిన్ రక్షణను తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది .

 ఫోర్త్ వేవ్ పై జపాన్ వాసుల భయాలు

ఫోర్త్ వేవ్ పై జపాన్ వాసుల భయాలు

మార్చిలో టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్శిటీ మెడికల్ హాస్పిటల్‌లో వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన 14 మందిలో 10 మందిలో "ఈక్" మ్యుటేషన్ కనుగొనబడింది. మార్చి నుండి రెండు నెలల వరకు, 36 మంది కోవిడ్ రోగులలో 12 మంది మ్యుటేషన్ తీసుకున్నారు, వారిలో ఎవరూ ఇటీవల విదేశాలకు వెళ్లలేదు లేదా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులతో సంబంధాన్ని నివేదించలేదు. అయినప్పటికీ ఈ ఉత్పరివర్తన జపాన్ వాసులకు ఆందోళన కలిగిస్తుంది. దీని వల్ల ఫోర్త్ వేవ్ మొదలవుతుంది అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+