ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్లీ ఆయనే

ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఆంథోనీ ఆల్బనీస్ (Antony Albanese) వరుసగా రెండోసారి విజయం సాధించారు. శనివారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆల్బనీస్ నాయకత్వంలోని లేబర్ పార్టీ గెలుపొందింది. దీంతో 2004 తర్వాత వరుసగా అధికారంలోకి వచ్చిన తొలి ప్రధానిగా ఆల్బనీస్ రికార్డు సృష్టించారు. దీంతో ఆయన మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్ తన ఓటమిని అంగీకరించారు. తాము సరిగ్గా రాణించలేదని, ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. కాగా, ప్రతినిధుల సభలోని 150 స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా, అధికార లేబర్ పార్టీ ఇప్పటికే 86 స్థానాల్లో విజయం సాధించి, మెజార్టీ మార్క్ అయిన 76ను దాటేసింది.

Antony Albanese wins second term as Australian Prime Minister

కాగా, ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం, ఇంధన విధానాలు, ఇళ్ల కొరత, వడ్డీ రేట్లలో పెరుగుదల వంటి సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతో రెండోసారి లేబర్ పార్టీ ఎన్నికల్లో సునాయాస విజయం సాధించింది.

2022 నుంచి ప్రధానిగా ఉన్న ఆంథోనీ ఆల్బనీస్.. మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆంథోనీ ఆల్బనీస్ మాట్లాడుతూ.. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకున్న ప్రస్తుత సమయంలో.. ఆస్ట్రేలియన్లు ఆశావాదం, దృఢ సంకల్పాన్ని ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆల్బనీస్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు దేశాధినేతలు అభినందనలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+