వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"వాళ్లేం చూశారో, దాన్ని అలాగే చూడాలని నాకు కోరికగా ఉండేది. ఆ స్పేస్‌క్రాఫ్ట్ ఎక్కి, అదే కిటీకీలోంచి చూస్తూ, వాళ్లు చంద్రుడి మీద నడిచినప్పుడు ఏం చూశారో అది చూడాలని కోరిక."

ఆండీ సాండర్స్‌ను ఈ కోరిక తీవ్రంగా వెంటాడింది. దాంతో ప్రాజెక్ట్ అపోలో ముందుకొచ్చింది.

అపోలో 11.. చంద్రుడి మీద మానవుడు కాలుపెట్టిన క్షణం. మానవజాతి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం.

ఆండీకి ఆ కోరికతో పాటు తీవ్ర నిరాశ కూడా ఉండేది. అదేంటంటే, 1960ల చివర్లో, 1970 ప్రారంభంలో స్పేస్ మిషన్లను రికార్డ్ చేసిన చిత్రాలు. ఇంకా సులువుగా చెప్పాలంటే, ఆ చిత్రాలను మనకు చూపించిన పద్ధతి... షార్ప్‌గా లేకుండా, ఫ్లాట్‌గా, బాగా కంప్రెస్ చేసిన ఆ ఫొటోలు చూస్తే ఆయనకు నిరాశ, నిస్పృహలు ఆవరించేవి.

అందుకే, చెషైర్ ప్రాపర్టీ డెవలపర్‌గా పనిచేస్తున్న ఆండీ సాండర్స్‌ కొన్నేళ్ల కిందట తన కెరీర్‌కు స్వస్తి చెప్పి, యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా) ఫొటో ఆర్కైవ్‌లపై తన పూర్తి సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నారు.

ఫలితంగా, అద్భుతమైన 'అపోలో రీమాస్టర్డ్' పుస్తకం వెలువడింది. ఆనాటి ఫొటోలను మెరుగుపరచి కనువిందు చేశారు ఆండీ సాండర్స్‌. మరో ప్రపంచానికి మానవాళి మొదటి ప్రయాణాన్ని వివరించే నాలుగు వందల చిత్రాలను మన కళ్ల ముందు ఉంచుతుందీ పుస్తకం.

వీటిల్లో కొన్ని అత్యంత ప్రసిద్ధమైన చిత్రాలు. వాటిని మీరు చూసే ఉంటారు. కానీ, మిగతావి మీరెప్పుడూ, ఎక్కడా చూసి ఉండరు. కచ్చితంగా ఆండీ చూపించినట్టు మాత్రం చూసి ఉండరు. ఆ ఫొటోల్లో ఉన్న క్లారిటీ, లోతులను గమనిస్తే అందులో కనిపిస్తున్నవాటిని నిజంగా తాకాలనే కోరిక కలుగుతుంది.

ఒరిజినల్ ఫొటో ఫిల్మ్ మెటీరియల్‌ను హై-డెఫినిషన్ స్కాన్ చేసి వీటిని తయారుచేశారు. ఒరిజినల్ ఫొటో ఫిల్మ్‌లను నాసా జాగ్రత్తగా భద్రపరిచింది. డిజిటల్ ఫొటోగ్రఫీలో ఆండీకి ఉన్న అనుభవం, ఇష్టం కూడా ఇందుకు తోడ్పడింది.

"చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టాలను అత్యుత్తమ క్వాలిటీతో మనమెందుకు చూడకూడదు? అనిపించింది. వాళ్లు బెస్ట్ కెమేరాలు, బెస్ట్ లెన్స్, బెస్ట్ ఫిల్మ్ వాడి వాటిని తీశారు. వాటిని మనం మంచి క్వాలిటీతో చూడకపోతే అర్థం లేదు" అంటారు ఆండీ.

ఆండీ పుస్తకంలో, చంద్రుడి మీద నిలబడ్డ నీల్ ఆర్మ్‌స్టాంగ్ ఫొటో ఒకే ఒక్కటి ఉంది. (ఈ చారిత్రక వ్యక్తి చంద్రుడి ఉపరితలంపై దిగినప్పటి ఫొటోలు ఎందుకు ఎక్కువ లేవు?)

అపోలో 13కు సంబంధించిన ఫొటో కూడా ఉంది. చంద్రుడి మీద కాలు పెట్టిన మూడవ ప్రయత్నం అది.

అలాగే, అపోలో 14 చంద్రుడి మీదకు వెళ్లినప్పుడు కొట్టిన గోల్ఫ్ బాల్‌ను కూడా చూడవచ్చు. అందులో వెళ్లిన అలన్ షెపర్డ్ దాన్ని "మైళ్ల వేగంతో కొట్టినా, కేవలం 40 మీటర్లు వెళ్లిందని" చెప్పారు.

ఆండీ వర్క్ చేసిన వాటిల్లో బెస్ట్ ఏంటంటే, చంద్రుడి పైకి ప్రయాణంలో ఆస్ట్రోనాట్‌లు తమ క్యాప్సూల్స్‌లోంచి తీసిన 16మిమీ మూవీ సీక్వెన్సులు. అపోలో ఆర్కైవ్‌లో 10 గంటల పాటూ సాగే మెటీరియల్ ఉంది. వాటిని మరింత అందంగా తీర్చిదిద్దారు ఆండీ.

అపోలో 8 వ్యోమగామి బిల్ ఆండర్స్ తన 'హోమ్ మూవీస్'లో ఉపయోగించిన 'క్యూ కార్డ్' లేదా 'క్లాపర్‌బోర్డ్' ఫొటో ఒక క్లాసిక్ ఉదాహరణ. వీటి ఒరిజినల్ వీడియోలు బ్లర్ అయి, చాలా పెద్ద పెద్ద శబ్దాలతో ఉన్నాయి. ఆండీ తన కంప్యూటర్ మాయాజాలంతో, అంతకుముందు వాటిల్లో కనిపించని దృశ్యాలను మనం ముందు ఆవిష్కరించారు.

ఈ పుస్తకం ముఖచిత్రం బహుసా ఆండీ ఫెవరెట్ కావచ్చు. దీని ఒరిజినల్ ఫొటోలో అంతా చీకటి. కానీ, ఆండీ దాన్ని ఆధునిక డిజిటల్ సాఫ్ట్‌వేర్‌తో బ్రైట్ చేసి, అందులో విషయాలు మనకు కనిపించేలా చేశారు. అందులో, అపోలో 9 కమాండర్, బబుల్ హెల్మెట్‌లో ఉన్న జిమ్ మెక్‌డివిట్ భూమికి చాలా ఎత్తులో రెండు అంతరిక్ష నౌకలను మాన్యువల్‌గా నిలుపబోతున్న దృశ్యం అది.

"1969లో అపోలో వ్యోమగామి అద్భుత చిత్రం అది. కిటీకీలోంచి ఆయన ఆశ్చర్యంగా చూస్తున్న చిత్రం. ఇదే మొదటిసారి, స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉన్న మనుషులు దాన్ని వెనక్కి రప్పించలేకపోయిన సందర్భం. ఎందుకంటే అప్పుడు వాళ్లు లూనార్ మాడ్యూలు టెస్ట్ చేస్తున్నారు. వాళ్లకు హీట్‌షీల్డ్ లేదు. కాబట్టి వాళ్లు స్పేస్‌క్రాఫ్ట్‌ను నిలుపలేకపోతే, భూమి మీదకు తిరిగి రాలేకపోయేవారు. అది చాలా అపురూపమైన క్షణం. చారిత్రక ఘట్టం" అని వివరించారు ఆండీ.

ఈ ప్రాజెక్ట్ కోసం ఆండీ లైట్, కలర్‌లో శిక్షణ తీసుకున్నారు. అలాగే, ఎంతోమంది వ్యోమగాములతో మాట్లాడారు. ప్రతీ చిత్రంలోని వివరాలను ఒడిసిపట్టుకునేందుకు ఆండీ ఎంతో శ్రమించారు.

"ఫొటోలో కలర్‌ను ప్రభావిత్రం చేసే అంశాలు చాలా ఉంటాయి. కొన్ని చిత్రాలు బాగా పాతబడ్డాయి. కొన్నిటిని కొంచం భిన్నంగా ప్రాసెస్ చేశారు. వ్యోమగామి కమాండ్ మాడ్యూల్ విండో నుంచి ఫొటో తీస్తే కలర్ కొంచం వేరుగా వస్తుంది. లూనార్ మాడ్యూల్ విండోలోంచి తీస్తే మరోలా ఉంటుంది" అని చెప్పారు ఆండీ.

మరికొన్ని రోజుల్లో నాసా తన ఆర్టెమిస్ ప్రోగ్రాంను ప్రారంభించనుంది. ఇది చంద్రుడి పైకి క్యాప్స్యూల్ పంపిస్తుంది. మానవులు లేకుండా చంద్రుడి మీదకు వెళుతున్న సేప్‌క్రాఫ్ట్ ఇది.

ఆర్టెమిస్ తీసే చిత్రాలు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. 360 డిగ్రీలలో ఫొటోలు తీస్తుంది. 4K డెఫినిషన్, లైవ్ స్ట్రీమింగ్‌తో మంచి చిత్రాలు ఆశించవచ్చు.

ఆండీ సాండర్స్‌

ఆ చిత్రాలు చూడడానికి కుతూహలంగా ఉందని ఆండీ చెప్పారు. కానీ, పాత కెమేరాలు తీసిన ఫొటోలకున్న సొగసు కొత్తవాటికి ఉండదేమోననే సందేహం కూడా వ్యక్తం చేశారు.

"చంద్రుడిపై కాలుపెట్టబోతున్న తొలి మహిళా వ్యోమగామి చిత్రాన్ని చూడబోతున్నాం. ఎందుత అద్భుతమైన క్షణం అది! ఆ క్షణాన్ని ఫొటోలో బంధిస్తారని ఆశిస్తున్నా" అన్నారు ఆండీ.

అపోలో రీమాస్టర్డ్ పుస్తకాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. ఆండీ ఈ ఫొటోల వివరాలను ట్విట్టర్‌లో, ఇన్స్‌స్టాగ్రాంలో పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Apollo: If you look at these photos, you will feel like you have gone to the moon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X