
Apple: బైక్‌లతో ఐఫోన్ కెమెరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది – యూజర్లకు యాపిల్ హెచ్చరిక

పెద్ద శబ్దాలతో వేగంగా దూసుకెళ్లే బైక్‌ల నుంచి వచ్చే వైబ్రేషన్లతో ఐఫోన్ యూజర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని యాపిల్ సంస్థ సూచించింది. ఈ వైబ్రేషన్లతో యాపిల్ ఫోన్ల కెమెరా వ్యవస్థ దెబ్బతినే ముప్పు ఉందని హెచ్చరించింది.
జీపీఎస్ సేవల కోసం వేగంగా కదిలే శక్తిమంతమైన బైక్‌లపై ఐఫోన్లను పెట్టకూడదని సంస్థ ఓ ప్రటకనను విడుదల చేసింది.
''ఇంజిన్ల నుంచే వచ్చే వైబ్రేషన్లతో ఐఫోన్లలోని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదా క్లోజ్డ్ లూప్ ఆటోఫోకస్ సిస్టమ్ వ్యవస్థలు దెబ్బతింటాయి’’అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఫోన్లను తమ వాహనాలపై పెట్టే స్కూటర్లు, మోపెడ్ డ్రైవర్లు కూడా వైబ్రేషన్ల తీవ్రతను తగ్గించే పరికరాలను ఉపయోగించాలని యాపిల్ సూచించింది.
జీపీఎస్ సహాయం కోసం బైక్‌కు అమర్చడంతో తమ మొబైల్ ఫోన్లు దెబ్బతిన్నాయని చాలా మంది ఐఫోన్ వినియోగదారులు సోషల్ మీడయాలో పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో యాపిల్ స్పందించింది.
కొన్ని ఐఫోన్ మోడల్స్.. ఇలా దెబ్బతినే ముప్పుందని యాపిల్ సూచించింది.
- యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్
- అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్, యాపిల్ సంస్థలు చైనాకు అనుకూలంగా పనిచేస్తున్నాయా

వైబ్రేషన్లే కారణం...
ఫోన్ కదలికలు, వైబ్రేషన్లు, భూమి గురుత్వాకర్షణల ప్రభావం ఫోటోలపై పడకుండా చూసేందుకు ఐఫోన్లలో కొన్ని ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. వీటినే బైక్‌లు దెబ్బతీస్తున్నాయి.
''భారీ శబ్దాలతో వేగంగా దూసుకెళ్లే బైక్‌ల నుంచి శక్తిమంతమైన వైబ్రేషన్లు వస్తుంటాయి. ఇవి ఫ్రేమ్‌లు, హ్యాండిల్‌బార్స్ గుండా ఫోన్‌లోకి చొచ్చుకెళ్తుంటాయి’’అని ప్రకటనలో యాపిల్ పేర్కొంది.
''ఇలాంటి శక్తిమంతమైన వైబ్రేషన్లకు సమీపంలో ఫోన్లు ఉంటే వాటిలోని కీలకమైన వ్యవస్థలు దెబ్బతింటాయి. ఫలితంగా ఫోటోలు, వీడియోల నాణ్యత తగ్గిపోతుంది.’’
''అందుకే, జీపీఎస్ సేవల కోసం బైక్‌లపై ఫోన్‌లు పెట్టకూడదు.’’
ఇవి కూడా చదవండి:
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)