వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావాలని చేయలేదు, క్షమించండి: యాపిల్, భారీ డిస్కౌంట్ల ప్రకటన

|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో: తమ ఫోన్ల వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులకు యాపిల్ సంస్థ విచారం వ్యక్తం చేసింది. పాత ఐఫోన్‌ బ్యాటరీలు సరిగా పనిచేయడం లేదని చాలా మంది వినియోగదారులు వాపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన యాపిల్ సంస్థ.. వినియోగదారుల అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.

అంతేగాక, వాటి స్థానంలో కొత్త బ్యాటరీలకు డిస్కౌంట్లో ఇస్తామని ప్రకటించింది. బ్యాటరీ సమస్యలపై ఐఫోన్‌ యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యాపిల్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

చిక్కుల్లో యాపిల్

చిక్కుల్లో యాపిల్

కాగా, ఐఫోన్‌ 6 సహా కొన్ని మోడళ్లలో బ్యాటరీలు సరిగా పనిచేయడం లేదని, మాటిమాటికీ స్విచ్ఛాఫ్‌ అవుతున్నాయని వినియోగదారులు పోతున్న వార్తలు ఇటీవల వచ్చాయి. కొన్ని దేశాల్లో అయితే కొందరు యూజర్లు సంస్థపై దావా కూడా వేశారు. దీంతో యాపిల్‌ వివాదాల్లో చిక్కుకుంది.

Recommended Video

Apple iPhone 8 X Features Leaked : Apple's Most Expensive iPhone- Oneindia Telugu
క్షమాపణలు చెబుతున్నాం

క్షమాపణలు చెబుతున్నాం

ఈ నేపథ్యంలో యాపిల్‌ స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా తాము తమ ఉత్పత్తుల నాణ్యతను తగ్గించబోమని స్పష్టంచేసింది. ‘బ్యాటరీలు వినియోగ పరికరాలు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాటి పనితీరు తగ్గిపోతుంది. యాపిల్‌ ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా తమ కస్టమర్లకు ఇబ్బందులు తలపెట్టదు. అలా జరిగిందని మీరు భావిస్తే.. అందుకు క్షమాపణలు చెబుతున్నాం' అని పేర్కొంది.

డిస్కౌంట్లతో కొత్తవి అందిస్తాం

డిస్కౌంట్లతో కొత్తవి అందిస్తాం

అంతేగాక, ‘యూజర్లు మా ఐఫోన్లను వీలైనంత ఎక్కువ కాలం వినియోగించుకోవాలనే మేం కోరుకుంటాం. యాపిల్‌ ఉత్పత్తులు ఎక్కువ రోజులు మన్నుతాయని చెప్పేందుకు మేం గర్విస్తున్నాం. అయితే ఇటీవల కొన్ని బ్యాటరీల్లో సమస్యలు వచ్చాయని విన్నాం. వాటి స్థానంలో కొత్తవి తీసుకునేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాం' అని యాపిల్‌ వెల్లడించింది.

వినియోదారులకు ఊరట

వినియోదారులకు ఊరట

వారెంటీ పూర్తయిన బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీని తీసుకునేందుకు ధరను 79 డాలర్ల నుంచి 29 డాలర్లకు తగ్గిస్తున్నట్లు యాపిల్‌ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి డిసెంబర్‌ 2018 వరకు ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందిస్తామని యాపిల్ తెలిపింది. యాపిల్ ప్రకటనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు కొంత ఊరట కలిగిందనే చెప్పవచ్చు.

English summary
Apple iPhone, iPad and MacBook users now have a more complete picture of what happens to the batteries in their devices as they age, along with a series of suggestions from Apple about how to lengthen battery life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X