ధర పెంపు: యాపిల్ నిర్ణయంపై భారతీయుల అసహనం
న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐఫోన్ తన సరికొత్త మోడల్ ఐఫోన్ ఎస్‌ఈని ఇటీవలే ఆవిష్కరించింది. 4 అంగుళాల స్క్రీన్‌తో ఉన్న ఈ ఫోన్ ఫీచర్ల పరంగా ప్రపంచ వినియోగదారులను ఆకర్షించింది.
ధర కూడా అమెరికాలో 26,500 రూపాయలుగా సంస్థ ప్రకటించడంతో చాలామంది వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫోన్ ప్రస్తుతం అమెరికన్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

కాగా, భారతదేశంలో ఏప్రిల్ చివరి నాటికి ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. అమెరికాలో 26,500 రూపాయలకు అందిస్తున్నారు కాబట్టి 30,000 రూపాయలకు ఇండియాలో అందుబాటులోకి వస్తుందని వినియోగదారులు భావించారు. సంస్థ కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అయితే ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది. ధర విషయంలో తాజా నిర్ణయం ఇండియన్లకు మాత్రం నిరాశకు గురిచేసింది. ఈ మోడల్‌ను ఇండియాలో 39,000 రూపాయలకు అందిస్తామని సంస్థ తాజాగా ప్రకటించింది. దీంతో భారత వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాపిల్ కంపెనీపై వారి అసహనాన్ని తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications