ఆపిల్ సిఈవో టిమ్ కుక్‌కు భారీగా వేతనం, ప్రైవేట్ విమానంలోనే ప్రయాణం

Posted By:
Subscribe to Oneindia Telugu

శాన్‌ప్రాన్సిస్కో: ఆపిల్‌ కంపెని సీఈవో టిమ్ కుక్ వేతనం 47 శాతం పెరిగింది. వేతనంతో పాటు ఆయన భద్రతను కూడ పెంచారు. టిమ్ కుక్ ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోనే వెళ్ళాలని కంపెనీ నిర్ణయం తీసుకొంది

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం 47 శాతం జంప్‌ చేసింది. 13 మిలియన్‌ డాలర్లకు టిమ్ కుక్ వేతనం చేరింది. ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చూస్తే ఆయన వేతనం సుమారు రూ.83 కోట్లు. భద్రతాపరమైన కారణాలతో ఆయన వ్యక్తిగత అవసరాలకు కూడా ప్రైవేట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌నే వాడాలని కంపెనీ నిర్ణయం తీసుకొంది.

Apple's Tim Cook must fly private, after making $13 million in 2017

తమ గ్లోబల్‌ ప్రొఫైల్‌లో భాగంగా భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2017 నుంచి టిమ్‌కుక్‌కు ఈ పాలసీ అమలు చేస్తున్నామని, సీఈవోగా టిమ్‌ కుక్‌ బాధ్యత చాలా ముఖ్యమైనదని ఆపిల్‌ షేర్‌హోల్డర్‌ ప్రొక్సీ స్టేట్‌మెంట్‌లో ఫైల్‌ చేసింది.

2017లో 12.8 మిలియన్‌ డాలర్లను ఇంటికి తీసుకెళ్లారని, దానిలో 3.06 మిలియన్‌ డాలర్ల వేతనం, 9.3 మిలియన్‌ డాలర్లు నగదు బోనస్‌లు, మిగిలినవి అదనపు పరిహారాలున్నాయని ఓ అంతర్జాతీయ పత్రిక రిపోర్ట్ చేసింది.

అంతకముందు ఆయనకు 5.4 మిలియన్‌ డాలర్ల బోనస్‌లు మాత్రమే చెల్లించేవారని రిపోర్టు పేర్కొంది. పరిహారాల ప్యాకేజీల్లో భాగంగా టిమ్‌ కుక్‌ వ్యక్తిగత ప్రయాణానికి 2017లో 93,190 డాలర్లు ఖర్చు అయినట్టు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Apple CEO Tim Cook, who saw his salary and perks jump 47 per cent to almost $13 million in 2017, will now fly on private aircraft even for personal travel for "security and safety reasons".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి