వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

FIFA World Cup Final: ఫుట్‌బాల్ జగజ్జేతగా: నరాలు తెగే ఉత్కంఠత.. 36 ఏళ్ల తరువాత..!!

|
Google Oneindia TeluguNews

దోహా: ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) ప్రపంచ కప్ 2022 ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఫైనల్ మ్యాచ్ పూర్తయింది. ఈ సాకర్ పండగకు ఆతిథ్యాన్ని ఇచ్చిన ఖతర్‌లోని లుసెయిల్ స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠతను రేకెత్తించిందీ ఫైనల్. 90 నిమిషాల్లో పూర్తి కావాల్సిన మ్యాచ్.. రెట్టింపు సమయాన్ని తీసుకుంది. ఫైనల్‌లో అర్జెంటీనా- ఫ్రాన్స్ మధ్య హోరాహోరీగా సాగిన పోరుకు నిలువుటద్దం పట్టింది.

సీట్ ఎడ్జ్ మ్యాచ్..

సీట్ ఎడ్జ్ మ్యాచ్..

భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ మొదలైంది. పలువురు సాకర్ సూపర్ స్టార్లకు ఇది చివరి ఫిఫా వరల్డ్ కాబోతోండటం, హేమాహేమీల్లాంటి జట్లు వెనుదిరిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టీ ఈ మ్యాచ్ మీదే నిలిచింది. లుసెయిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా- ఫ్రాన్స్ తలపడ్డాయి. కొదమసింహాల్లా పోరాడాయి. ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టాయి. మ్యాచ్ టైమ్‌, ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా రెండు జట్లు సమవుజ్జీగా నిలిచాయింటే ఎంత పట్టదలగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.

సమవుజ్జీలుగా..

సమవుజ్జీలుగా..

ఈ రెండు జట్లు కూడా మొదటి నుంచీ టైటిల్ హాట్ ఫేవరెట్స్‌గానే ఉంటూ వచ్చాయి. లీగ్స్ దశతో పాటు సెమీ ఫైనల్స్‌లో అభిమానుల అంచనాలకు అనుగుణంగా సత్తా చాటాయి. ఈ రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులను చిత్తు చేసి, ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఫైనల్‌లో కూడా అదే పట్టుదలను ప్రదర్శించాయి. మ్యాచ్‌ను పోగొట్టుకోవడానికి ఏ జట్టు కూడా ఇష్టపడలేదు. పట్టు వదలకుండా పోరాడాయి. గంటన్నరలో ముగియాల్సిన మ్యాచ్‌.. మూడు గంటల పాటు సాగింది.

విన్నింగ్ ప్రాబబిలిటీకి అనుగుణంగా..

విన్నింగ్ ప్రాబబిలిటీకి అనుగుణంగా..

ఈ రెండు జట్ల మీద కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. విన్నింగ్ ప్రాబబిలిటీ దాదాపుగా సమానంగా ఉంటోంది. 90 నిమిషాల పాటు జరిగే ఈ పోరులో ఫ్రాన్స్ వైపు మొగ్గు చూపిన అభిమానుల సంఖ్య 33 శాతంగా ఉంది. అర్జెంటీనా గెలుస్తుందని అంచనా వేసిన ఫేవరెట్లు 37 శాతం మంది ఉన్నారు. ఎక్స్‌ట్రా టైమ్ వైపు 30 శాతం మంది అభిమానులు అంచనా వేశారు. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా రసవత్తరంగా సాగింది మ్యాచ్.

జగజ్జేతగా..

జగజ్జేతగా..

చివరికి జగజ్జేతగా అర్జెంటీనా ఆవిర్భవించింది. 36 సంవత్సరాల నిరీక్షణకు తెర దించింది. లియెనెల్ మెస్సి.. సగర్వంగా కప్‌ను ముద్దాడాడు. పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించాడీ సాకర్ సూపర్ స్టార్. మ్యాచ్ టైమ్‌లో 2-2 గోల్స్‌తో సమవుజ్జీగా నిలిచాయి అర్జెంటీనా, ఫ్రాన్స్. తొలుత అర్జెంటీనా రెండు గోల్స్ సాధించినప్పటికీ- ఫ్రాన్స్ స్టార్ ఎంబాపా వరుసగా రెండు గోల్స్ కొట్టి స్కోర్‌ను సమం చేశాడు. దీనితో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. అక్కడా అంతే ఈ రెండు జట్లు కూడా 3-3 గోల్స్‌తో సమంగా నిలిచాయి.

పెనాల్టీ షూటౌట్..

పెనాల్టీ షూటౌట్..

దీనితో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ ఫ్రాన్స్ తడబడింది. తొలి గోల్‌ను కొట్టి ఫ్రాన్స్ బోణీ కొట్టినప్పటికీ- అదే దూకుడును కొనసాగించలేకపోయింది. తొలి గోల్‌ను కైలియన్ ఎంబాప్పె సాధించాడు. 1-0తో నిలిపాడు. అర్జెంటీనా జట్టులో మెస్సి గోల్ కొట్టాడు. స్కోర్‌ను 1-1తో సమం చేశాడు.

మిస్ చేసుకున్న ఫ్రాన్స్..

మిస్ చేసుకున్న ఫ్రాన్స్..

ఆ తరువాత ఫ్రాన్స్‌లో కింగ్‌స్లే విఫలం అయ్యాడు. ఈ షూటౌట్ మిస్ అయింది. అర్జెంటీనా మాత్రం ఆ తప్పు చేయలేదు. పాలో డైబాలా బంతిని నెట్స్‌లో పంపగలిగాడు. 2-1తో నిలిచింది అర్జెంటీనా. ఫ్రాన్స్ ప్లేయర్ షోమెనీ విఫలం అయ్యాడు. అదే సమయంలో అర్జెంటీనా ఆటగాడు లోరిస్ గోల్ కొట్టడంతో ఆధిక్యత 3-1 పెరిగింది. ఫ్రాన్స్ కొలొ మవుని గోల్ కొట్టినప్పటికీ 3-2 తేడాతో ఆధిక్యతలోనే నిలిచింది అర్జెంటీనా. చివర్లో మాంటెల్ మరో గోల్ కొట్టడంతో 4-2 తేడాతో ఫీఫా ప్రపంచకప్ అర్జెంటీనా వశమైంది.

English summary
Argentina beat defending champion France by 4-2 on penalties to win FIFA World Cup after 36 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X