పురుషుల్లా మేం: మిస్ అమెరికా.. ఆర్మీ అధికారిణి
వాషింగ్టన్: ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్, ఐటీ విశ్లేషకురాలైన ఇరవై ఆరేళ్ల దెషానా బార్బర్ ఈ ఏడాది మిస్ అమెరికా కీరిటాన్ని గెలుచుకుంది. యుద్ధ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని గట్టిగా సమర్థించిన బార్బర్ మిస్ అమెరికా పోటీలో విజేతగా నిలిచింది.
లాస్ వెగాస్‌లో జరిగిన వేడుకలో ఆమె టైటిల్‌ను గెలుచుకుంది. మిలిటరీలోని ప్రతి శాఖలో మహిళల ప్రాతినిధ్యాన్ని అమెరికా ఆహ్వానించడాన్ని ఆమె సమర్థించింది. పురుషుల తరహాలోనే తాము కూడా టఫ్ అని, లింగ భేదం అమెరికాను వేరు చేయదని న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

ఈ పోటీల్లో హవాయ్‌కు చెందిన చెల్సీ హార్డిన్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే విశ్వసుందరి పోటీలకు బార్బర్ అమెరికా నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. కాగా, ఈ మిస్ అమెరికా పోటీలు ఆదివారం నాడు జరిగాయి.












Click it and Unblock the Notifications