గుర్తింపు కార్డులు చూసి..బస్సు నుంచి కిందికి దించి! యథేచ్ఛగా కాల్పులు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మరోసారి రక్తమోడింది. కరాచి-గ్వాదర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ లోని ఒర్మారా ప్రాంతంలోని మక్రాన్ కోస్టల్ జాతీయ రహదారిపై సాయుధులైన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కరాచీ వైపునకు వెళ్తోన్న ఆరు బస్సులను అటకాయించారు. ప్రయాణికుల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించారు.

ఈ ఆరు బస్సుల నుంచి ఎంపిక చేసిన 16 మంది ప్రయాణికులను కిందికి దించారు. వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 14 మంది అక్కడిక్కడే మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. సుమారు 20 మంది వరకు సాయుధులు తమపై కాల్పులు జరిపి ఉంటారని క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తామే ఈ దురాగతానికి పాల్పడినట్లు ఇప్పటిదాకా ఏ ఉగ్రవాద సంస్థ గానీ, అతివాదులు గానీ ప్రకటించుకోలేదు. ఆ ఘటనపై ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.

At least 14 passengers shot dead in Pakistans Balochistan province

బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు హింసాత్మక ఘటనలకు పాల్పడటం నెలరోజుల్లో ఇది రెండోసారి. ఇదివరకు క్వెట్టా సమీపంలోని ఓ కూరగాయల మార్కెట్ లో షిస్తే సామాజిక వర్గానికి చెందిన ముస్లిం చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, బాంబు పేలుడు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 17 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+