సిరియా ఆగని నరమేథం.. కారుబాంబు పేలుడులో 14 మంది మృతి

అజాజ్ : సిరియా మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు రోజుల క్రితం జరిగిన బాంబు పేలుడులో పది మంది మృతి చెందిన ఘటన మరువకముందే మరో కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 13 మంది చనిపోగా.. 30మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

ఆగని నరమేథం

ఆగని నరమేథం

ప్రస్తుతం టర్కీ విప్లవకారుల ఆధీనంలో ఉన్న సిరియా సరిహద్దు రాష్ట్రమైన అలెప్పోలోని అజాజ్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది. రంజాన్ మాసం సందర్భంగా ప్రజలంతా షాపింగ్‌ చేస్తూ బిజిగా ఉన్న సమయంలో బాంబు పేలింది. సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కారులో డిటోనేటర్లతో దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు ప్రకటించారు.

సామాన్యులే లక్ష్యంగా దాడి

రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం మార్కెట్లన్నీ రద్దీగా ఉండడంతో సామాన్య ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. కారులో అమర్చిన డిటోనేటర్లతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. బాంబు పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలన్నీ ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. బాంబు పేలుడు తీవ్రత భారీగా ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం రక్కా నగరంలో ఇలాంటి దాడే జరిగింది. ఈ ఘటనలో పదిమంది మరణించగా... పలువురికి గాయాలయ్యాయి. కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్స్ ఈ దాడికి బాధ్యత వహించింది.

దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్

దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్

మరోవైపు సిరియాలో ఇడ్లిబ్ నగరాన్ని టార్గెట్‌గా చేసుకుని రష్యా, ఇరాన్ జరుపుతున్న దాడులను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఆ రెండు దేశాలు సిరియాపై బాంబుల వర్షం కురిపించడం మానుకోవాలని హితవుపలికారు. అమాయకుల ప్రాణాలు తీయడం సరికాదన్న ఆయన.. ఇప్పటికైనా ఈ నరమేథానికి స్వస్తి పలకాలని అన్నారు. ప్రపంచం అంతా ఈ దారుణాన్ని చూస్తోందన్న విషయాన్ని మర్చిపోవద్దని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+