వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:జైల్లో 20 వేల సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు దొరికాయి, స్మార్ట్ ఫోన్లతో ఎంజాయి ఇలా.....

బ్రిటన్ లోని ఒక జైలు ఖైదీలకు విలాసవంతంగా మారింది. జైలులో ఇంట్లో మాదిరిగానే ఖైదీలు ఎంజాయి చేస్తున్నారు. జైలులో సుమారు 20 వేల సెల్ ఫోన్లను, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనంచేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్:బ్రిటన్ లోని ఒక జైలు ఖైదీలకు విలాసవంతంగా మారింది. జైలులోనే ఇంట్లో లభించే అన్ని రకాల సౌకర్యాలను ఖైదీలకు లభిస్తున్నాయి. జైలుకు వెళ్ళామనే ఫీలింగ్ కూడ వారికి లేకుండా పోయింది.స్మార్ట్ ఫోన్లతో సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తున్నారు ఖైదీలు.

బ్రిటన్ లోని ఓ జైలులో ఖైదీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. మొబైల్ ఫోన్లను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.స్మార్ట్ ఫోన్ల సహయంతో సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో అధికారులు జైలులో విస్తృతంగా తనిఖీలు చేశారు. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు.

జైలులో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఇరవై వేల సెల్ ఫోన్లు దొరికాయి, అంతే సంఖ్యలో సిమ్ కార్డులు దొరికాయి. గత రెండేళ్ళలో దొరికిన మొబైల్ ఫోన్ల కంటే ఈ సారి రెట్టింపు స్థాయిలో దొరకడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

At least 20,000 mobile phones and sim cards discovered in prisons last year

జైలులో ఉంటూనే తమ నేరచరిత్రను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ఈ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. హత్యలు, డ్రగ్స్ , వ్యాపారం, కిడ్నాప్ వంటి ఎన్నో పనులకు ఈ ఫోన్లను వాడుతున్నారు. తొలుత సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను న్యాయశాఖ కార్యదర్శి లిజ్ ట్రస్ కొత్త నిబంధనలు జారీ చేశారు.

ఇక నుండి అన్ని జైళ్ళలో మొబైల్స్ సిగ్నల్ జామర్లు పెట్టాలని ఆదేశించారు. ఈ విషయమై గతంలోనే డేవిడ్ హన్సన్ అనే లేబర్ పార్టీకి చెందిన మాజీ న్యాయశాఖ మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వాస్తవాలు వెలుగు చూసిన నేపథ్యంలో తాను గతంలోనే చెప్పానని , కానీ వాటిని పెడచెవిన పెట్టడం వల్లే ఈ రకంగా జరిగిందన్నారాయన. 2018లో బ్రిటన్ లో పలు జైళ్ళలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 20175 మొబైల్ ఫోన్లు బయటపడ్డాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 18 శాతం పెరిగాయి. గత ఏడాది 16,987 మొబైల్ ఫోన్లు, యూఎస్ బి లు , సిమ్ కార్డులు దొరికాయి.

English summary
At least 20,000 mobile phones and sim cards were discovered in prisons last year - more than double the number recorded two years earlier. The proliferation of handsets in jails has been linked to drugs and organised crime, while some inmates have used the devices to film themselves and post videos on websites such as Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X