ఘోర ప్రమాదం: గ్యాస్ ట్యాంకర్ పేలి 35 మంది మృతి, 100 మందికి గాయాలు
అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది వరకు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. గ్యాస్ టాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ బృందం సెమా సహాయక చర్యలు చేపట్టింది.
అబుజాలోని లాఫియా మాకర్ది రహదారి పెట్రోల్ స్టేషన్ వద్ద గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అక్కడి వారు మాట్లాడుతూ... ట్యాంకర్‌లో నుంచి పెట్రోల్ స్టేషన్ సిబ్బంది గ్యాస్ తీసుకుంటున్న సమయంలో పేలుడు సంభవించిందన్నారు. ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన భయంకరమైన విషాదమని నైజీరియా సెనేట్ ప్రెసిడెంట్ అన్నారు. గాయాలపాలైన వారిని తాను పరామర్శించానని చెప్పారు.
కాగా నైజీరియాలో ఇటువంటి ప్రమాద ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. అక్కడి రోడ్లు సరిగ్గా లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications