Attack: విల్లు, బాణాలతో విరుచుకుపడిన రియల్ బాహుబలి, ఐదు మందిని చంపేసి చిక్కిపోయాడు !

నార్వే/ కాంగ్స్ బర్గ్: నిత్యం రద్దీగా ఉండే సిటీలో సాయయంత్రం ఇంటికి వెళ్లే ముందు ప్రజలు ఎవరికి కావలసిన వస్తులు వారు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. వ్యాపారులు కూడా వాళ్లవాళ్ల వ్యాపారం చేసుకుంటూ వారిపనిలో వారు నిమగ్నం అయ్యారు. కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ గోడ దగ్గర ఓ వ్యక్తి భుజానికి విల్లు, బాణాలు వేసుకుని నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో చేతిలో పాపను ఎత్తుకుని అటువైపు వెలుతున్న ఆ వ్యక్తిని కొంచెం అనుమానంగా చూస్తూనే అటువైపు వెళ్లింది. కొంతపేసటి తరువాత ఆ వ్యక్తి విల్లు చేతిలో పట్టుకుని బాణాలు తీసుకుని అటు వైపు వెలుతున్న వారి మీద గురి చూసి దాడి చెయ్యడం మొదలు పెట్టాడు. బాణాల దెబ్బకు ఒక్కొక్కరు కుప్పకూలడం మొదలు పెట్టారు. అనుకోని ఈ సంఘటనతో అటు వైపు వెలుతున్న ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. బాహుబలి సినిమాలో బళ్లాలదేవుడి టైపులో ప్రజల మీద విచక్షణా రహితంగా బాణాలతో దాడి చెయ్యడంతో ఐదు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చాలా మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిపాలైనారు. సర్వసాధారణంగా తుపాకులతో అమాయకుల మీద విరుచుకుపడుతున్న ఉగ్రవాదులు గురించి అందరికీ తెలుసు. అయితే విచిత్రంగా బాహుబలి సినిమాలో లాగా విల్లు, బాణాలతో ఐదు మందిని చంపడం కలకలం రేపింది. నిందితుడిని డెన్మార్క్ జాతీయుడు డానీష్ గా పోలీసులు గుర్తించారు.

 గోడ పక్కన విల్లు, బాణాలతో వైయిటింగ్

గోడ పక్కన విల్లు, బాణాలతో వైయిటింగ్

నార్వేలోని కాంగ్స్ బర్గ్ నగరంలో ఆదేశ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజలు చాలా బిజీగా ఉన్నారు. నిత్యం రద్దీగా ఉండే కాంగ్స్ బర్గ్ సిటీలో సాయయంత్రం ఇంటికి వెళ్లే ముందు ప్రజలు ఎవరికి కావలసిన వస్తులు వారు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. వ్యాపారులు కూడా వ్యాపారం చేసుకుంటూ వారిపనిలో వారు నిమగ్నం అయ్యారు. కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ గోడ దగ్గర ఓ వ్యక్తి భుజానికి విల్లు, బాణాలు వేసుకుని నిలబడి ఉన్నాడు.

 విరుచుకుపడిన శాడిస్టు

విరుచుకుపడిన శాడిస్టు

నిందితుడు బాణాలు చేతిలో పట్టుకుని అనుమానంగా అటూఇటూ చూస్తున్న సమయంలో చేతిలో పాపను ఎత్తుకుని అటువైపు వెలుతున్న మహిళ అతన్ని కొంచెం అనుమానంగా చూస్తూనే అటువైపు వెళ్లింది. కొంతపేసటి తరువాత ఆ వ్యక్తి విల్లు చేతిలో పట్టుకుని బాణాలు తీసుకుని అటు వైపు వెలుతున్న వారి మీద గురి చూసి దాడి చెయ్యడం మొదలు పెట్టాడు.

 ప్రాణభయంతో పరుగులు తీశారు

ప్రాణభయంతో పరుగులు తీశారు

చేతిలో బలమైన విల్లు, బాణాలు పెట్టుకున్న ఆ వ్యక్తి కసితో ఎవరిమీద అంటే వారి మీద గురి చూసి బాణాలతో దాడి చెయ్యడం మొదలు పెట్టారు. అటువైపు వెలుతున్న వారు బాణాలు దూసుకుపోవడంతో కుప్పకూలిపోయారు. ఏం జరుగుతోందో అర్థం కాక సామాన్య ప్రజలు పరుగు తీశారు. ప్రజలు పరుగు తీస్తున్న విషయం గుర్తించిన స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు.

 ఐదు మంది అమాయకులు బలి

ఐదు మంది అమాయకులు బలి

బాణాల దెబ్బకు ఒక్కొక్కరు కుప్పకూలడం మొదలు పెట్టారు. అనుకోని ఈ సంఘటనతో అటు వైపు వెలుతున్న ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. బాహుబలి సినిమాలో బళ్లాలదేవుడి టైపులో ప్రజల మీద విచక్షణా రహితంగా బాణాలతో దాడి చెయ్యడంతో ఐదు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 దాడి జరిగింది నిజమే

దాడి జరిగింది నిజమే

విల్లు, బాణాలతో దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఐదు మంది ప్రాణాలు పోయి చాలా మందికి గాయాలైనాయని, వారిలో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒవింద్ ఆస్ స్థానిక మీడియాకు చెప్పారు.

 నిందితుడిని పట్టుకున్న పోలీసులు

నిందితుడిని పట్టుకున్న పోలీసులు

విల్లు, బాణాలతో దాడి చేశాడని అనుమానంతో పట్టుకున్న వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐదు మందిని చంపిన వ్యక్తి కాంగ్స్ బర్గ్ లో నివాసం ఉంటున్న డెన్మార్క్ జాతీయుడు డానిష్ (37)గా పోలీసులు గుర్తించారని స్థానిక మీడియా చెప్పింది. ఇది ఉగ్రదాడి కాదు అని తాము పూర్తిగా కొట్టివేయలేమని, పలు కోణాలలో విచారణ చేస్తున్నామని నార్వే పోలీసు అధికారులు అన్నారు. సాయంత్రం 6.15 గంటల నుంచి 6.45 గంటల మద్యలో విల్లు, బాణాలతో ఐదు మందిని హత్య చేసిన నిందితుడిని అర్దగంటలోనే పోలీసులు పట్టుకున్నారు. డెన్మార్క్ జాతీయుడు డానీష్ ఎందుకు సైకోలాగా మారాడు అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

Recommended Video

    తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీఈటీ టీచర్లు!!
     ఛోటా బాహుబలి బెండ్ తీస్తున్న పోలీసులు

    ఛోటా బాహుబలి బెండ్ తీస్తున్న పోలీసులు

    సర్వసాధారణంగా ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో సామాన్య ప్రజలు, పోలీసులను లక్షంగా చేసుకుని దాడులు చేస్తుంటారు. అయితే విల్లు, బాణాలతో దాడులు చేసి ఐదు మంది అమాయకులను చంపడం నార్వేలో కలకలం రేపింది. నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అతను ఎందుకు బాణాలతో సామాన్య ప్రజలను చంపేశాడు ?, అతని లక్షం ఏమిటి ? అని విచారణ చేస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+