వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AUKUS: ఆస్ట్రేలియా, అమెరికా ఒప్పందంపై ఫ్రాన్స్ ఆగ్రహం.. వెన్నుపోటు పొడిచాయని ఆరోపణ.. రాయబారులను వెనక్కు పిలిపించిన మేక్రాన్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆస్ట్రేలియా జలాంతర్గామి

ఇటీవల, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికాల మధ్య ఒక భద్రతా ఒప్పందం జరిగింది. ఈ కూటమిని 'ఆకుస్' (AUKUS) అని పిలుస్తున్నారు.

ఈ ఒప్పందానికి నిరసనగా ఫ్రాన్స్.. అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి తన రాయబారులను చర్చల కోసం వెనక్కు పిలిపించింది.

పరిస్థితులు "అసాధారణంగా మారడంతో" ఈ "అసాధారణ నిర్ణయం" తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి తెలిపారు.

ఈ ఒప్పందంలో భాగంగా అణుశక్తితో నడిచే జలాంతర్గాములను నిర్మించే సాంకేతికతను ఆస్ట్రేలియాకు అందిస్తారు.

తాజా ఒప్పంద వలన, గతంలో ఆస్ట్రేలియాతో చేసుకున్న కొన్ని బిలియన్ డాలర్ల ఒప్పందం రద్దు కావడంతో ఫ్రాన్స్ ఆగ్రహానికి గురైంది.

వివాదాస్పద సౌత్ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనే ప్రయత్నంగా ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌లు ఈ ఒప్పందం చేసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో వర్చువల్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఈ భద్రతా ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా అధ్యక్షుడు స్కాట్ మారిసన్ బుధవారం ఒక ప్రకటన చేశారు.

ఈ కూటమి గురించి బహిరంగ ప్రకటన చేయడానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఫ్రాన్స్‌కు దీని గురించి సమాచారం అందించారు.

ఈ ఒప్పందాన్ని "వెన్నుపోటు"గా పేర్కొంటూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ అభ్యర్థన మేరకు తమ రాయబారులను వెనక్కు పిలిపించినట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవెస్ లే డ్రియన్ శుక్రవారం ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఒప్పందం "మిత్రపక్షాలు, భాగస్వాముల మధ్య ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. ఫలితంగా, మా స్నేహ సంబంధాలు, భాగస్వామ్యాలు, యూరోప్‌కు ఇండో-పసిఫిక్ ప్రాముఖ్యత పట్ల మాకున్న దృష్టి కోణం మారుతుంది" అని లే డ్రియన్ పేర్కొన్నారు.

ఫ్రాన్స్ నిర్ణయానికి బైడెన్ విచారం వ్యక్తం చేశారని, విభేదాలను పరిష్కరించేందుకు రాబోయే రోజుల్లో ఫ్రాన్స్‌తో చర్చలు జరుపుతారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ వాషింగ్టన్ నుంచి మాట్లాడుతూ, ఫ్రాన్స్ "నిరుత్సాహాన్ని" అర్థం చేసుకోగలమని, "ద్వైపాక్షిక సంబంధాలకు తాము ఇచ్చే విలువను" ఫ్రాన్స్‌కు వివరించి చెప్పేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మిత్ర దేశాల నుంచి రాయబారులను వెనక్కు రప్పించడం సాధారణంగా జరిగే విషయం కాదని, ఫ్రాన్స్ కూడా అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి తమ రాయబారులను వెనక్కు పిలిపించడం ఇదే మొదటిసారి అని నిపుణులు అంటున్నారు.

అమెరికా, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలను పురస్కరించుకుని సంబరాలు జరుపుకోవడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన వేడుకను వాషింగ్టన్‌లోని ఫ్రెంచ్ దౌత్యవేత్తలు ఇప్పటికే రద్దు చేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్

అమెరికా చిరకాల మిత్రదేశం ఆగ్రహానికి గురైంది

ఫ్రాన్స్ కన్నుగప్పి ఆస్ట్రేలియా ఈ ఒప్పందానికి సిద్ధపడిందని, ఫ్రాన్స్‌కు ఇది ఆర్థికంగా నష్టం చేకూరుస్తుందని వాషింగ్‌టన్‌లో బీబీసీ స్టేట్ డిపార్ట్మెంట్ కరస్పాండెంట్ బార్బరా ప్లెట్ అషర్ అభిప్రాయపడ్డారు.

"ఈ కొత్త భద్రతా ఒప్పందం గురించి బహిరంగ ప్రకటన చేసే కొన్ని గంటల ముందే తమకు తెలియడం మరింత ఆగ్రహం కలిగించిందని, ఈ ఒప్పందం పూర్తిగా ఆశ్చర్యాన్ని కలిగించిందని ఫ్రెంచ్ అధికారులు చెప్పారు.

ఫ్రాన్స్ రాయబారులను వెనక్కు పిలిపిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

ఫ్రాన్స్, అమెరికాకు చిరకాలం నుంచీ మిత్ర దేశంగా ఉందని, ఈ రెండు దేశాల మధ్య విభేదాలను రూపుమాపేందుకు అమెరికా కృషి చేస్తుందని వైట్ హౌస్ అధికారి వెల్లడించారు" అని ఆమె అన్నారు.

అణుశక్తితో నడిచే జలాంతర్గాములను నిర్వహించే ఏడవ దేశంగా ఆస్ట్రేలియా

ఈ ఒప్పందం తరువాత, అణుశక్తితో నడిచే జలాంతర్గాములను నిర్వహించే ఏడవ దేశంగా ఆస్ట్రేలియా అవతరిస్తుంది.

అంతే కాకుండా, ఈ కూటమిలోని దేశాలు సైబర్ సామర్థ్యాలు, కృత్రిమ మేధస్సు, ఇతర సముద్రగర్భ సాంకేతికతలను కూడా పంచుకుంటాయి.

ఈ ఒప్పందం కారణంగా, 12 సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించడానికి 2016లో ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో సంతకం చేసిన 37 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందానికి గండి పడింది.

మరోవైపు, ఈ కూటమిలోని మూడు దేశాలూ "ప్రచ్ఛన్న యుద్ధానికి" కాలు దువ్వుతున్నాయని చైనా ఆరోపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
AUKUS:France unhappy with US-Australia deal, Macron calls off Ambassadors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X