Bharat Biotech: బిగ్ రిలీఫ్: కోవాగ్జిన్‌కు ఆ దేశం గ్రీన్ సిగ్నల్: భేషుగ్గా వెళ్లొచ్చు

క్యాన్‌బెర్రా: హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్‌కు ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ ఇచ్చింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి అవసరమైన అనుమతిని మంజూరు చేయలేదు. మరింత అదనపు సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. వాటిని పరిశీలించిన తరువాతే- తుది నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేసింది.

రిలీఫ్ ఇచ్చిన ఆస్ట్రేలియా..

రిలీఫ్ ఇచ్చిన ఆస్ట్రేలియా..

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్ యాజమాన్యానికి బిగ్ రిలీఫ్ దక్కింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఫలితంగా- ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు నిరభ్యంతరంగా ఆస్ట్రేలియాకు రాకపోకలు సాగించవచ్చు. కోవాగ్జిన్‌తో పాటు చైనాకు చెందిన సినోఫార్మ్ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ-కర్‌వీ వ్యాక్సిన్‌కు కూడా తాము అనుమతి ఇచ్చినట్లు ఆస్ట్రేలియా తెలిపింది. కోవాగ్జిన్, బీబీఐబీపీ రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

ఏ దేశం నుంచైనా..

ఏ దేశం నుంచైనా..

కోవాగ్జిన్, బీబీఐబీపీ-కర్‌వీ వ్యాక్సిన్లను వేసుకున్న ప్రయాణికులు భారత్ లేదా చైనా నుంచి మాత్రమే కాకుండా.. ఏ దేశం నుంచైనా స్వేచ్ఛగా రాకపోకలను సాగించవచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాదిమంది విద్యార్థులు, స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్లకు ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన థెరాపాటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్, ఆస్ట్రేలియా రెగ్యులేటరీ అథారిటీ ఫర్ థెరాపాటిక్ గూడ్స్ ఓ ప్రకటనను జారీ చేసింది.

నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి..

నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి..

కాగా ప్రయాణికులు అందరూ కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్లను అందజేయడాన్ని ఆస్ట్రేలియా తప్పనిసరి చేసింది. అలాగే- వ్యాక్సిన్ వేయించుకోని విదేశీ ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి ఉంటుంది. ఇదివరకు ఆస్ట్రేలియా.. తమ దేశానికి వచ్చే విదేశీయులపై పలు రకాల ఆంక్షలను విధించిన విషయం తెలిసిదే. వారు తమ దేశంలో అడుగు పెట్టడానికి పరిమితంగా అనుమతి ఇచ్చింది. 14 రోజుల క్వారంటైన్ కాలాన్ని తప్పనిసరి చేసింది. తమ దేశ పౌరులకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేసింది.

వ్యాక్సినేషన్‌లో వాటా..

వ్యాక్సినేషన్‌లో వాటా..


ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్‌లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అత్యధికంగా వినియోగమౌతోంది. స్పుత్నిక్ వీ వాటా పరిమితంగా ఉంటోంది. వాటన్నింటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులను మంజూరు చేసింది. ఒక్క కోవాగ్జిన్‌ మినహాయించి. ప్రపంచంలో ఏ దేశానికైనా వాటిని ఎగుమతి చేయడానికి ఈ ఎమర్జెన్సీ లిస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్‌ఓ కొనుగోలు చేసి.. పేద దేశాలకు సరఫరా చేస్తుంటుంది.

77.8 శాతం ఎఫీషియన్సీ..

77.8 శాతం ఎఫీషియన్సీ..

కరోనా వైరస్‌పై కోవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యంతో కోవాగ్జిన్ పని చేస్తుందంటూ ఇదివరకు క్లినికల్ ట్రయల్స్ నిర్ధారణ చేశాయి. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌పై ఇది 65.2 శాతం మేర ప్రభావం చూపుతుందని తేలింది. కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు లభిస్తాయని ఆశించినప్పటికీ.. దీనికి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. మళ్లీ భారత్ బయోటెక్ యాజమాన్యం.. ఈ అదనపు సమాచారాన్ని అందజేయాల్సి ఉంటుంది. దీనిపై నవంబర్ 3వ తేదీన ఈ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మరోసారి భేటీ అవుతుంది.

ఎల్లుండి డబ్ల్యూహెచ్ఓ మళ్లీ భేటీ..

ఎల్లుండి డబ్ల్యూహెచ్ఓ మళ్లీ భేటీ..

కాగా- కోవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చే విషయంలో డబ్ల్యూహెచ్ఓ ఈ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్.. ఎల్లుండి మరోసారి సమావేశం కానుంది. ఈలోగా భారత్ బయోటెక్ యాజమాన్యం.. పూర్తి సమాచారాన్ని అందజేయాల్సి ఉంటుంది. అదే చివరి అసెస్‌మెంట్ అవుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. తాము అడిగిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటే.. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సంతృప్తిని వ్యక్తం చేస్తే- 24 గంటల వ్యవధిలో కోవాగ్జిన్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌కు అనుమతి ఇస్తామని డబ్ల్యూహెచ్ఓ ఇదివరకే స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+