వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుష్కకు ముద్దిచ్చి, మిచెల్‌ను కవ్వించిన కోహ్లీ టార్గెట్: అంపైర్ వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా - భారత్ టెస్టు సిరీస్ వాడిగావేడిగా సాగుతోంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రధానంగా భారత్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకున్నారు. కోహ్లీ కూడా వారికి ధీటుగానే సమాధానం ఇస్తున్నాడు. మాటకు మాట ఇవ్వడంతో పాటు బ్యాట్‌తోను తన సత్తా చూపిస్తూ 'కంగారె'త్తిస్తున్నాడు.

విరాట్ కోహ్లీని ఎలా ఆపాలో తెలియక ఆసీస్ జట్టు సతమతమవుతోంది. ఆస్ట్రేలియా అంటేనే స్లెడ్జింగ్‌కు పేరు. దీంతో ఈ సిరీస్‌కు వెళ్లేముందే కోహ్లీ తన మనసులోని విషయాన్ని చెప్పాడు. వారికి ధీటుగా సమాధానం చెబుతామని చెప్పాడు. మాటకు మాట ఇస్తామన్నాడు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

చెప్పినట్లుగానే అతను వారికి ధీటుగా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అయినందున స్లెడ్జింగ్ విషయమై తాను ఎప్పుడో మానసికంగా సిద్ధమయ్యానని చెప్పాడు. అందరిలా ఊరికే ఉండలేనని చెప్పాడు. విరాట్ ఇటు బ్యాటు, అటు నోటితో ఆసీస్‌ను కంగారు పెడుతున్నాడు.

దీంతో ఆసీస్ కూడా విరాట్ మీదే ప్రదానంగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ముందుగానే మానసికంగా సిద్ధమైన విరాట్ కోహ్లీ... ఆసీస్ ప్లేయర్లు స్లెడ్జింగ్ చేస్తే వారికి ఆటతోనూ సమాధానం చెబుతున్నాడు. ఆదివారం నాడు కోహ్లీను కవ్వించిన మిచెల్ జాన్సన్ ఖంగుతిన్న విషయం తెలిసిందే.

Australia vs India: Relentless Virat Kohli Sledges Mitchell Johnson, Sets Up Fiery Day 5 at MCG

నిలకడగా ఆడుతున్న కోహ్లీ ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు జాన్సన్ అనేకసార్లు యత్నించాడు. ఓసారైతే రివర్స్ త్రో చేసి కోహ్లీ సహనాన్ని పరీక్షించాడు. ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. కానీ తన కోపాన్నంతా బంతి పైనే చూపించాడు కోహ్లీ. 169 పరుగులతో ఆసీస్‌కు చుక్కలు చూపించాడు!

అంతేకాదు, తాను సెంచరీ చేసిన అనంతరం స్టాండ్స్‌లో ఉన్న తన ప్రియురాలికి బ్యాట్ ద్వారా ముద్దు ఇచ్చాడు. ఆ తర్వాత మరో ముద్దు కూడా ఇచ్చాడు. అయితే, అది మిచెల్ జాన్సన్‌ను కవ్వించేందుకు. మిగతా ఆటగాళ్లను పక్కన పెడితే కోహ్లీ మాత్రం ఆటతో, మాటతో ఆసీస్‌తో దూకుడు ప్రదర్శిస్తున్నాడు.

గత ఇంగ్లాండ్ పర్యటనలో భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను బీసీసీఐ అనుమతించింది. అప్పుడు విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. ఈసారి మాత్రం అనుష్క శర్మ స్టాండ్‌లో ఉన్నప్పుడు కోహ్లీ దుమ్మురేపాడు. అంతేకాదు, ఆమెకు బ్యాట్ ద్వారా ముద్దులు పంపించాడు.

కోహ్లీకి వార్నింగ్

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్, విరాట్ కోహ్లీల మాటల యుద్ధం కొనసాగుతోంది. మెల్బోర్న్ టెస్టు నాలుగో రోజు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జాన్సన్ అవుటై వెళ్తుండగా కోహ్లీ పలు వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్ 68వ ఓవర్లో షమీ బౌలింగులో జాన్సన్ అవుటయ్యాడు.

అతను పెవిలియన్‌కు వెళ్తుండగా కోహ్లీ ఏదో అన్నాడు. జాన్సన్ కూడా స్పందించాడు. అయితే జాన్సన్.. కోహ్లీకి బదులిచ్చాడా, అంపైర్లకు ఫిర్యాదు చేశాడా తెలియాల్సి ఉంది. అనంతరం అంపైర్లు ఇద్దరు కోహ్లీతో మాట్లాడారు. కోహ్లీకిఅంపైర్లు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

English summary
Virat Kohli, who explicitly said that he had no respect for Mitchell Johnson, irked the mercurial Australian pacer by sledging him and giving him a send-off on Day 4 of the MCG Test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X