పర్వతాలు, లోయ: ఎంహెచ్370 గాలింపుకు దశాబ్దాలు!
కౌలాలంపూర్: గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ఆచూకీ కోసం దశాబ్దాలు పట్టవచ్చునని మలేషియా ఎయిర్ లైన్స్ బాస్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. బ్రిటిష్ పత్రిక ఇంటర్వ్యూలో ఆయన గల్లంతైన మలేషియా విమానం విషయమై స్పందించారట.
విమానం సముద్రంలో గల్లంతవడమంటే ఓ కాంక్రీట్ గోడను ఢీకొన్నట్లేనని ఆయన అభిప్రాయపడ్డారట. విమానానికి సంబంధించిన శిథిలాలు సముద్రంలో చెల్లా చెదురు అవుతాయని, సముద్రంలో పెద్ద ఎత్తున విస్తరిస్తాయని ఆయన చెప్పారట.
సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయని, పెద్ద పెద్ద లోయలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎంహెచ్ 370 విమానాన్ని గుర్తించేందుకు చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారట. ఇందుకు దశాబ్దాలు పట్టవచ్చునని ఆయన చెప్పారని తెలుస్తోంది.

కాగా, గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 కోసం హిందూ మహాసముద్రం దక్షిణంగా గాలించాలని ఇటీవల నిర్ణయించారు. తొలుత ఎక్కడైతే విమానం కూలిపోయి ఉంటుందని అనుమానించారో ఆ ప్రాంతంలోనే గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇప్పుడు గాలిస్తున్న ప్రాంతానికి దక్షిణ వైపునకు వెళ్లాలని భావిస్తున్నట్టు ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్టు సెఫ్టీ బ్యూరో కమిషనర్ మార్టిన్ డొలన్ వెల్లడించారు. విమానం గాలింపునకు అత్యాధునిక పరికరాలు, కొత్తకొత్త విధానాలు అవలంబిస్తున్నప్పటికీ ఆచూకీ తెలుసుకోలేకపోయారు. నీటి అడుగు భాగంలోకంటూ గాలింపు చర్యలు చేపడితే ఫలితం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే కొత్త దిశగా గాలింపుచేపట్టాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications