వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్లు తెరవకుండానే 13 మంది శిశువులు సజీవ దహనం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రాజధానిలోని యార్‌మౌక్ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి ఒక్కసారిగా ప్రసూతి వార్డులో మంటలు వ్యాపించాయి.

ఈ మంటలు వెంటనే వార్డు మొత్తానికి వ్యాపించడంతో ఇంక్యుబేటర్‌లో ఉన్న 13 మంది శిశువులు కళ్లు కూడా తెరవకుండానే కాలి బూడిదయ్యారు. తొలుత మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది 29 మందిని కాపాడగలిగారు. వారిందరినీ ప్రస్తుతం ఆసుపత్రిలోని వేరొక వార్డుకు తరలించారు.

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొన్న ఆయన దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు.

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

మరోవైపు ఈ ప్రమాదపై ఆసుపత్రి డైరెక్టర్ షాద్ హదీమ్ అహ్మాద్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అన్నారు.

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

అగ్ని ప్రమాదంలో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో మరిన్ని ప్రాణాలను కాపాడగలిగామని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో సిబ్బంది అప్రమత్తత వల్ల 29 మహిళా రోగులతో పాటు 8 మంది శిశువులను రక్షించగలిగామని పేర్కొన్నారు.

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

ఈ ప్రమాదంతో తల్లిదండ్రుల రోదనలతో ఆసుపత్రి మిన్నంటింది. ఈ అగ్నిప్రమాదంలో కవల పిల్లలను కోల్పోయిన హుస్సేన్ ఓమర్ అనే వ్యక్తి ఆవేదన వర్ణనాతీతం.

 కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

కళ్లు తెరవకుండానే కాలి బూడిదైన 13 మంది శిశువులు

అగ్ని ప్రమాద సమయంలో ఆసుపత్రి సిబ్బంది వ్యవహిరించిన తీరుపై అతడు తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బాధితులు కూడా ఆసుపత్రి యాజమాన్యంపై మండిపడ్డారు.

English summary
At least seven other children including three suffering from smoke inhalation and 29 women were also rescued from the Yarmouk Hospital and transferred to another site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X