మోడీ షాక్‌తో పాక్ ఉక్కిరిబిక్కిరి: 'యుద్ధానికి దిగితే భారత్‌కే నష్టం'

లాహోర్: ఉగ్రవాదం పైన ప్రధాని నరేంద్ర మోడీ ఘాటు స్పందనతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాటిని తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ దౌత్యవేత్తలు సిద్ధమయ్యారు. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్‌ను ఒంటరి చేయాలని భారత్ భావించింది. ఇందులో విజయం సాధించింది.

ఇప్పుడు దౌత్యవేత్తలు భారత్ పైన పడ్డారు. పాక్‌ను ఒంటరి చేయాలనుకుంటున్న భారత్ కల ఎప్పటికీ నెరవేరదని ఓ పాక్ దౌత్యవేత్త అన్నారు. భారత్ యుద్ధానికి దిగదని, యుద్ధమంటూ జరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు.

ఈ విషయం వారికి కూడా బాగా తెలుసునని చెప్పారు. ఈ కథనాన్ని దౌత్యవేత్త పేరు ప్రస్తావించకుండా డాన్ పత్రిక ప్రచురించింది. 'యుద్ధం ఉండకపోవచ్చు. మేం యుద్ధం మొదలు పెట్టాలనుకోవడం లేదు. ఈ దశలో యుద్ధం అంటూ జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. అందుకే భారత్ కూడా యుద్ధాన్ని ఎంచుకోదు' అని సదరు దౌత్యవేత్త అభిప్రాయపడ్డాడు.

Baloch Leader Brahamdagh Bugti's Cousin Backs Pakistan, Says Will Fight India

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ మిలటరీని యుద్ధానికి సన్నద్ధం చేస్తోందన్న వార్తలతో గతవారంలో చిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించడంతో కరాచీ మార్కెట్ పాతాళానికి పడిపోయింది. గత నెల 18న యూరీపై ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్యా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పూర్తిగా ఉగ్రవాద శిబిరాలను తమ దేశం నుంచి నిర్మూలించే పరిస్థితి లేదని మరో పాకిస్తాన్ విద్యావేత్త వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మనుగడకు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ఇప్పుడు వెనక్కు తీసుకునే పరిస్థితి లేదన్నాడు. పాక్ పైన ఒత్తిడిని పెంచుతున్న కొద్దీ భారత్ ఒత్తిడిలో పడుతుందని పాక్ సీనియర్ జర్నలిస్ట్ జాహిద్ హుస్సేన్ అన్నాడు.

మరోవైపు, భారత్‌తో యుద్ధమే వస్తే తాను పాకిస్థాన్‌వైపే పోరాడతానని బలూచీ నాయకుడు, బృహందా బుగ్టీకి వరుసకు సోదరుడయ్యే షాజైన్‌ బుగ్టీ చెప్పాడు. బలోచిస్థాన్‌ వేర్పాటువాద ఉద్యమంలో బృహందా కీలకపాత్ర పోషిస్తున్నారు.

తనకు ఆశ్రయం కల్పించాలని ఆయన భారత్‌ను కూడా కోరారు. షాజైన్‌ మాత్రం తనతోపాటు తన గిరిజన పోరాట యోధులు కూడా పాకిస్తాన్ వైపే నిలబడతారన్నారు. దీంతో బలూచీ వేర్పాటు ఉద్యమంలో అంతర్గత విభేదాలున్నట్లు స్పష్టమైంది.

యూరీ దాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా యూరీ దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు. అంతేగాక, ఈ విషయంలో సైన్యం మాట్లాడదని, తన పరాక్రమాన్ని చూపిస్తుందన్నారు. అలాగే, సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశలోను చర్చలు కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+