వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఢాకా: అత్యాచారం కేసులో అరెస్టైన బంగ్లాదేశ్ క్రికెటర్ రుబెల్ హుస్సేన్‌కు బెయిల్ లభించింది. ఢాకా కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు అతడికి బెయిల్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల మోడల్, సినీ నటి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ గడువు ముగియడంతో జనవరి 8న ఢాకా మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట అతడు లొంగిపోయాడు. తాజాగా అతడికి మరోసారి బెయిల్ లభించింది. ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికైన రుబెల్ హుస్సేన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత వారమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతడ్ని ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేసింది.

గత వారం ఆతడిని కస్టడీకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని సినీ నటి అయిన 19ఏళ్ల యువతి డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్

అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్

అత్యాచారం కేసులో అరెస్టైన బంగ్లాదేశ్ క్రికెటర్ రుబెల్ హుస్సేన్‌కు బెయిల్ లభించింది. ఢాకా కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు అతడికి బెయిల్ ఇచ్చింది.

అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్

అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని సినీ నటి అయిన 19ఏళ్ల యువతి డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్

అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్

బాధితురాలికి, నిందితుడికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. కాగా, తనను వివాహం చేసుకునేందుకు హుస్సేన్ అంగీకరించినట్లయితే తాను పెట్టిన కేసును ఉపసంహరించుకుంటానని బాధితురాలు పేర్కొంది.

అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్

అత్యాచారం కేసులో బంగ్లా క్రికెటర్‌కు బెయిల్

2013 సెప్టెంబర్‌లో విడులైన ‘కిచు ఆశా భలోబాస' అనే చిత్రం ద్వారా బాధితురాలి వెండితెరకు పరిచయమైంది. ఒక వేళ తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించినట్లయితే అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇది ఇలా ఉండగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడలేదని, ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా అనలేదని నిందితుడు రుబెల్ చెబుతున్నాడు.

దీంతో కేసును విచారించిన ఢాకా కోర్టు నిందితుడు రుబెల్ హుస్సేన్‌కు రిమాండ్ విధించింది. నిందితుడు రుబెల్ హుస్సేన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ అయ్యేంత వరకు జైలు ఉండాలని ఆదేశిచింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చామని ఢాకా డిసిపి అనిసూర్ రెహమాన్ తెలిపారు.

బాధితురాలికి, నిందితుడికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. కాగా, తనను వివాహం చేసుకునేందుకు హుస్సేన్ అంగీకరించినట్లయితే తాను పెట్టిన కేసును ఉపసంహరించుకుంటానని బాధితురాలు పేర్కొంది.

2013 సెప్టెంబర్‌లో విడులైన ‘కిచు ఆశా భలోబాస' అనే చిత్రం ద్వారా బాధితురాలి వెండితెరకు పరిచయమైంది. ఒక వేళ తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించినట్లయితే అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇది ఇలా ఉండగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడలేదని, ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా అనలేదని నిందితుడు రుబెల్ చెబుతున్నాడు.

ఆ యువతి తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించాడు. కాగా, 22 టెస్టులాడిన రుబెల్ 32 వికెట్లు తీశాడు. 53 అంతర్జాతీయ వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచులో హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు.

English summary
Bangladesh cricketer Rubel Hossain was Sunday granted bail by a Dhaka court after his previous petition was rejected by the metropolitan magistrate's court in a case filed by model-actress Naznin Akter Happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X