"ఇంటిలో కుక్కలు పెంచితే కాల్చి పారేస్తాం"
బీజింగ్: పెంపుడు కుక్కలు ఇంట్లో ఉంటే కాల్చి చంపేస్తామని తూర్పు చైనాలోని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. సెప్టెంబర్ 10 లోపు పెంపుడు కుక్కలను ఇక్కడి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
షాన్ డాండ్ ప్రావిన్స్ లోని డయాంగ్ జిల్లా అధికారులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే ఇంటికి వచ్చి ఆ కుక్కలను అక్కడికక్కడే కాల్చి చంపేస్తామని హెచ్చరించారు. జంతు ప్రేమికులు ఈ విషయంపై ఆందోళన చేపట్టినా అధికారులు పట్టించుకోలేదు.

ఇప్పటికే లైసెన్స్ ఉన్న వారు సైతం కుక్కలు పెంచుకోవడానికి వీలు లేదని చెప్పారు. జిల్లాలో శుభ్రత, ప్రజల ఆరోగ్యం తమకు ముఖ్యం, మీ కుక్కలు కాదని సమాధానం ఇచ్చారు. అయితే ఇంతకు మించి కారణాలు తాము చెప్పమని అధికారులు అన్నారు.
డయాంగ్ జిల్లాలో పెంపుడు కుక్కలు ఉన్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అధికారులు తీసుకున్నఈ నిర్ణయాన్ని వారు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. తమ ఇండ్లలోకి అధికారులు ఎలా వస్తారు, ఎలా కుక్కలను కాల్చి చంపుతారో చూస్తామని అంటున్నారు.












Click it and Unblock the Notifications